Mamata Banerjee : బెంగాల్ కేబినెట్ లో కీలక మార్పులు
3న ముహూర్తానికి శ్రీకారం చుట్టిన సీఎం
Mamata Banerjee : ఈడీ దెబ్బకు పశ్చిమ బెంగాల్ కేబినెట్ లో మార్పులు చేసేందుకు కారణమైందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రూ. 50 కోట్ల రూపాయల నగదు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ సహాయకురాలిగా పేరొందిన సీనీ నటి అర్పిత ముఖర్జీ ఇళ్లల్లో జరిపిన సోదాల్లో బయట పడింది.
భారీ ఎత్తున నగదుతో పాటు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు ఆగస్టు 3న బుధవారం మార్పులు చేర్పులు చేయనున్నట్లు ప్రకటించింది. కనీసం ఇందులో నలుగురు కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. పార్థ ఛటర్జీని సస్పెండ్ చేశాక మార్పులు చేయాలని నిర్ణయించారు సీఎం.
ఆరోజు సాయంత్రం 4 గంటలకు పునర్విభజన జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మమతా బెనర్జీ(Mamata Banerjee) జాతీయ మీడియా ఏఎన్ఐ కి వెల్లడించింది.
సుబ్రతా ముఖర్జీ, సాధన్ పాండేలను కోల్పోయామని, ప్రస్తుతం పార్థ జైలులో ఉన్నాడని దీంతో కేబినెట్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మమతా బెనర్జీ.
మరో వైపు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఏడు కొత్త జిల్లాల గురించి కూడా ప్రస్తావించారు. మొత్తం జిల్లాల సంఖ్యను 23 నుండి 30కి పెంచారు.
సుందర్ బన్ , ఇచ్చెమటి, రణ ఘాట్ , బిష్ణు పూర్ , జంగీ పూర్ , బెహ్రాంపూర్ , మరో జిల్లాకు బసిర్హాట్ అని పేరు పెట్టారు.
Also Read : సీఎంపై పిల్ వేసిన న్యాయవాది అరెస్ట్