MP’s Protest : కొనసాగుతున్నఎంపీల నిరసనల పర్వం
సంజయ్ రౌత్ అరెస్ట్ పై భగ్గుమన్న శివసేన
MP’s Protest : సేమ్ సీన్ రిపీట్ అయ్యింది సోమవారం కూడా. లోక్ సభ, రాజ్యసభలలో ఎంపీల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
మరో వైపు శివసేన అగ్ర నాయకుడు, రాజ్యసభ ఎంపీ అక్రమ అరెస్ట్(MP’s Protest) ను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ లోపట, బయట నిరసనలు ఊపందు కోవడంతో సమావేశాలను మళ్లీ వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్.
నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పై లోక్ సభలో విపక్ష సభ్యులు మండిపడ్డారు. ధరల పెరుగుదలపై సభలో ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాణికం ఠాగూర్ , జోతిమిణి , రమ్య హరి దాస్ , టీఎన్ ప్రతాపన్ లను సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్ సభ వాయిదా పడింది.
ఇక భూ కుంభకోణం కేసులో రాజ్యసభ సభ్యుడు పార్టీ సీనియర్ నేత అయిన సంజయ్ రౌత్ అరెస్ట్ పై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని శివసేన ఎంపీలు ఎగువ సభలో ఆందోళన చేపట్టారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజకీయ ఎజెండాల కోసం కేంద్ర సర్కార్ ప్రధాన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆరోపించారు.
దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ చర్చను ప్రవేశ పెట్టాలని కోరింది. ఇక మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ వామపక్షాల సభ్యులు గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు.
Also Read : సంజయ్ రౌత్ అరెస్ట్ పై కాంగ్రెస్ కన్నెర్ర