Pratima Bhoumik : బెంగాల్ మంత్రులపై కేంద్ర మంత్రి ఫైర్
ఎన్నిసార్లు ఫోన్లు చేసినా రిప్లై ఇవ్వరు
Pratima Bhoumik : కేంద్ర సామాజిక శాఖ మంత్రి ప్రతిమా భూమిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం లోక్ సభ వేదికగా ఆమె పశ్చిమ బెంగాల్ కేబినెట్ లోని మంత్రుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రిగా తాను వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఇతర వాటి గురించి ఫోన్లు చేసినా ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు సమాధానం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు.
ఒక్కోసారి ఒక్కో మంత్రికి 10 సార్లు కాల్ చేశామని చెప్పారు. కానీ అటు వైపు నుంచి సమాధానం ఉండడం లేదన్నారు. ఇంతటి బాధ్యతా రాహిత్యంగా ఉన్న వాళ్లు మంత్రులుగా ఎలా ఎంపిక చేశారంటూ ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి అయిన తనకే ఆన్సర్ ఇవ్వని వీళ్లు ఎలా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని నిలదీశారు ప్రతిమా భూమిక్(Pratima Bhoumik) .
విచిత్రం ఏమిటంటే ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) మంత్రిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ రాష్ట్ర మంత్రులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వ పథకం అమలుపై పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇవాళ జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఒక అనుబంధ ప్రశ్నను లేవనెత్తారు.
రాష్ట్రంలోని అధికార టీఎంసీ పై దాడులు చేయడంతో కాల్స్ తీసుకోక పోవడం , మాట వినక పోవడం ఓ అలవాటుగా మారిందంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా మంత్రి ప్రతిమా భూమిక్ తో పాటు అధిర్ చౌదరి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు టీఎంసీ ఎంపీలు.
Also Read : కేంద్ర సర్కార్ కు సుప్రీంకోర్టు నోటీసులు