Nirmala Sitharaman : అంబానీ..అదానీలకు సపోర్ట్ అబద్దం
ప్రతిపక్షాల ఆరోపణలపై నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : దిగ్గజ వ్యాపారవేత్తలకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం సాగిల పడిందని, వారికి అన్ని విధాలుగా సేవలు అందిస్తోందంటూ ప్రతిపక్షాలు విరుచుకు పడ్డాయి.
ఈ దేశాన్ని వ్యాపారవేత్తలకు తాకట్టు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పూర్తిగా వారిని వెనకేసుకు వస్తోందని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ నిప్పులు చెరిగారు విపక్షాల ఎంపీలు.
కేవలం 133 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ప్రభుత్వం పూర్తి ఆ ఇద్దరి వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం , వారి వ్యాపారాలు మరింత పెరిగేందుకు, పెంచుకునేందుకు మాత్రమే పని చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
దీంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందన్నారు. కానీ వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, గౌతమ్ అదానీల కోసం కేంద్రం పని చేయడం లేదని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు. పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక మంత్రి స్పందించడం కలకలం రేపింది.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కూడా రెండు ప్రముఖ వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చు కుంటున్నాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
లోక్ సభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన రెండు ఒప్పందాలపై అదానీ గ్రూప్ తో సంతకం చేసిందని ధ్వజమెత్తారు.
దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు నిర్మలా సీతారామన్.
Also Read : ఈడీ సోదాలపై కాంగ్రెస్ నిరసన