Maldives President : భారత్ తో బంధం బలీయమైనది
ఆరు ఒప్పందాలపై ఇరువురు సంతకాలు
Maldives President : మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ మంగళవారం భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఇరు దేశాల మధ్య మరింత బంధం బలపడాలని ఆకాక్షించారు సోలిహ్. ఇరు దేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. మోదీతో భేటీ అనంతరం మాల్దీవుల చీఫ్ సోలిహ్ మీడియాతో మాట్లాడారు.
మాల్దీవులు భారత్ బంధం దౌత్యాని కంటే మించినదని స్పష్టం చేశారు. అంతకు ముందు న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో అధ్యక్షుడు ప్రధానితో సమావేశం అయ్యారు.
ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులలో గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ , పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రంగాలలో ఒప్పందాలు చేసుకున్నారు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ , నరేంద్ర మోదీ.
మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు 100 మిలియన్ గ్రాంట్ ..400 మిలియన్ల క్రెడిట్ లైన్ కింద నిర్మిస్తారు. మాల్దీవులలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత దేశం రూ. 100 మిలియన్ల రుణాన్ని కూడా పొడిగించింది.
రెండు దేశాల మధ్య సన్నిహిత బంధానికి ఇది ఓ ప్రత్యక్ష ఉదాహరణగా అభివర్ణించారు మాల్దీవుల అధ్యక్షుడు(Maldives President). అనంతరం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.
అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు మాల్దీవులకు 100 మిలియన్ డాలర్ల అదనపు రుణం అందించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఢిల్లీలో వ్యాపార ప్రతినిధి బృందంతో చర్చలు జరుపుతారు. ముంబై, మహారాష్ట్రలను కూడా సందర్శిస్తారు.
Also Read : నరేంద్ర మోదీ రియల్ టార్చ్ బేరర్