Imran Khan PEC : ఇమ్రాన్ ఖాన్ పార్టీ అక్రమ విరాళాల సేకరణ
పాకిస్తాన్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన
Imran Khan PEC : ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన పాకిస్తాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. నిన్నటి దాకా తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై నిప్పులు చెరుగుతూ, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్న ఇమ్రాన్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసింది పాకిస్తాన్ ఎన్నికల సంఘం.
రాజకీయ పార్టీలకు విదేశాల నుంచి నిధులు రాకుండా పాక్ చట్టం నిషేధించినా ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక – ఇ – ఇన్సాఫ్ పార్టీ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు విరాళాల రూపేణా పొందిందని బాంబు పేల్చింది ఎలక్షన్ కమిషన్.
విదేశీయుల నుంచి అక్రమంగా నిధులు పొందడాన్ని ఈసీ స్పష్టం చేయడంతో ఆ పార్టీపై వెంటనే నిషేధం విధించాలని పాకిస్తాన్ ప్రస్తుత ప్రభుత్వం డిమాండ్ చేసింది.
పాకిస్తాన్ తెహ్రీక్ – ఏ – ఇన్సాఫ్ పార్టీకి అమెరికా, ఆస్ట్రేలియా నుంచే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా డబ్బులు విరాళాల రూపేణా అందాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
అయితే రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చకుండా పాకిస్తాన్ లో ఇప్పటికే చట్టాన్ని రూపొందించారు. కాగా తనను ఇరికించేందుకు కావాలని సర్కార్ కుట్ర పన్నుతోందంటూ ఇమ్రాన్ ఖాన్(Imran Khan PEC) ఆరోపించారు.
తాజాగా ఎన్నికల కమిషన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారమన్నారు. తాను కానీ తన పార్టీ కాని , తన పార్టీకి చెందిన వారు ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.
ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగం తప్ప మరొకటి కాదన్నారు ఇమ్రాన్ ఖాన్.
Also Read : భారత్ తో బంధం బలీయమైనది