India Won Lawn Bowls : లాన్ బౌల్స్ లో భారత్ కు పసిడి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో అరుదైన ఘనత
India Won Lawn Bowls : బ్రిటన్ లోని బర్మింగ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ -2022లో భారత్ పతకాల లిస్టులో మరో పతకం వచ్చి చేరింది. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అత్యధిక పతకాలు గెలుచుకోగా తాజాగా లాన్ బౌల్స్ ఆటలో భారత్ చారిత్రాత్మక (India Won Lawn Bowls) విజయాన్ని నమోదు చేసింది.
బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ లో మహిళల ఫోర్స్ జట్టు దక్షిణాఫ్రికా ను ఓడించింది. ఇది లాన్ బౌల్స్ ఆటలో భారత దేశానికి మొట్ట మొదటి పతకం సాధించడంతో యావత్ భారతమంతా సంతోషంతో ఉప్పొంగి పోతోంది.
ఈ గెలుపుతో క్యాంపైన్ లో భారత్ కు నాలుగో బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్ లో మీరా బాయి చాను , గెరిమె, అచింత్ పసిడి పతకాలను సాధించి దేశానికి గర్వ కారణంగా నిలిచారు.
తాజాగా లాన్ బౌల్స్ లో భారత్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. కాగా దక్షిణాఫ్రికా జట్టు 10-8తో ముందుకు దూసుకు వచ్చింది. ఒక దశలో స్వర్ణం జారిపోతున్నట్లు అనిపించింది.
చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది మ్యాచ్. కాగా చివరి మూడు సెట్లలో భారత జట్టు 17-10 తో విజయం సాధించింది.
కామన్వెల్ గేమ్స్ లో ఇప్పటి వరకు భారత్ పతకాల పంట పండుతోంది. మొత్తం కడపటి వార్తలు అందేసరికి ఇండియాకు 10 పతకాలు సాధించింది. ఇందులో 4 స్వర్ణాలు 3 రజతాలు 3 కాంస్య పతకాలు దక్కాయి.
భారత్ పతకాన్ని సాధించడంతో జట్టును ప్రత్యేకంగా అభినందించారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
Also Read : నీ విజయం యువతకు స్ఫూర్తి దాయకం