KomatiReddy Raj Gopal Reddy : 21న ముహూర్తానికి రెడీ

ఢిల్లీలో అమిత్ షాతో రాజ‌గోపాల్ రెడ్డి భేటీ

KomatiReddy Raj Gopal Reddy : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

శ‌నివారం ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి, త‌రుణ్ చుగ్ ల‌తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాను క‌లిశాడు. అనంత‌రం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (KomatiReddy Raj Gopal Reddy) మీడియాతో మాట్లాడారు.

తాను ఆగ‌స్టు 21న బీజేపీలో చేరుతున్న‌ట్లు ఈ మేర‌కు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్లాక్ మెయిల‌ర్ , జైలుకు పోయి వ‌చ్చిన రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలో ప‌ని చేసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

కులం, ధ‌నం త‌ప్ప టీపీసీసీలో ఏమీ లేద‌న్నారు. మునుగోడులో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌న్నారు. తాను , త‌న సోద‌రుడు ఎప్పుడూ ప‌ద‌వుల కోసం పాకులాడ లేద‌ని స్ప‌ష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఇప్ప‌టికీ గౌర‌వం ఉంద‌న్నారు. కానీ ఇలాంటి విలువ‌లు లేని రేవంత్ రెడ్డి నిర్వాకం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స‌ర్వ నాశ‌నం కాక త‌ప్ప‌ద‌న్నారు.

అందుకే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌రిగీసి మ‌ళ్లీ పోటీకి దిగాన‌ని చెప్పారు కోమ‌టిరెడ్డి. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం సొంత నిధులు ఖ‌ర్చు చేశాన‌ని అన్నారు.

త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న రేవంత్ రెడ్డికి తాను బ‌హిరంగ స‌వాల్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ద‌మ్ముంటే త‌గిన ఆధారాలు చూపాల‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం కోసం మొట్ట మొద‌ట‌గా త‌న మంత్రి ప‌ద‌విని త్యాగం చేసిన ఘ‌న‌త వెంక‌ట్ రెడ్డిదేన‌ని పేర్కొన్నారు.

Also Read : కాంట్రాక్టుల కోసమే పార్టీని వీడారు

Leave A Reply

Your Email Id will not be published!