Rishi Sunak : ప్రధాని పదవికి నేనే కరెక్ట్ – రిషి సునక్
తాను ఎందుకు సరైన వ్యక్తినో కామెంట్
Rishi Sunak : యావత్ ప్రపంచం అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా పేరొందిన బ్రిటన్ పై ఫోకస్ పెట్టింది. మరో వైపు ఎవరు ప్రధాన మంత్రి రేసులో నిలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల్లో టాప్ లో నిలిచారు భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్(Rishi Sunak). ఆయన ఇప్పటికే మంత్రిగా ఉన్నారు.
దేశ విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ కూడా ఆయనకు గట్టి పోటీని ఇస్తోంది. ఈ తరుణంలో ఇటీవల కొంత వెనుకబడినట్లు అనిపించినా మెల మెల్లగా మళ్లీ పుంజుకుంటున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
ఇక కుంభకోణాలతో పాటు సెక్స్ స్కాండల్ వ్యవహారం గతంలో పీఎంగా ఉన్న బోరిస్ జాన్సన్ ను ప్రధాని పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఈ తరుణంలో కన్జర్వేటివ్ పార్టీ పరంగా ఎవరు ప్రధాన మంత్రి దేశానికి అవుతారనే దానిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి.
నాలుగు రౌండ్లలో భారీ ఆధిక్యంలోకి దూసుకు వచ్చారు రిషి సునక్. ఆయన ఎవరో కాదు ప్రపంచ ఐటీ రంగంలో టాప్ లో కొనసాగుతున్న కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసెస్ సంస్థ చైర్మన్ అల్లుడు ఈ రిషి సునక్(Rishi Sunak).
తాజాగా తాను ఎందుకు ప్రధాన మంత్రి ఉన్నత పదవికి సరైన వ్యక్తిననే విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం దేశం సంక్లిష్టమైన స్థితితో పాటు సమస్యలను ఎదుర్కొంటోంది.
వాటన్నింటిని పరిష్కరించే సత్తా, దమ్ము తనకు మాత్రమే ఉందన్నాడు రిషి సునక్. ప్రచార సమయంలో ప్రజలు తన సందేశానికి బాగా స్పందించారని చెప్పారు.
నమ్మకాన్ని పునరుద్దరించడం, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం , దేశానికి భరోసా కల్పించడం ఇవే తన ముందున్న లక్ష్యాలని స్పష్టం చేశాడు.
Also Read : కేంద్ర సర్కార్ పై వరుణ్ గాంధీ ఫైర్