Adhir Ranjan Chowdhury : రాముడి పేరుతో రావణుడికి పూజలు
నిప్పులు చెరిగిన అధీర్ రంజన్ చౌదరి
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
ఆపై ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ కు హాజరయ్యారు. ఆపై పీఎం ఇంటి ముట్టడి, రాష్ట్రపతి భవన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం, ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ , తదితరులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా తాము రామ మందిరం నిర్మాణం కోసం నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపామని దీనిని కాంగ్రెస్ కావాలని వ్యతిరేకిస్తున్నట్లు అర్థం అవుతోందంటూ అమిత్ షా కామెంట్ చేశారు.
బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. దీనిపై శనివారం ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందించారు.
రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నది ఎవరు. ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ. బీజేపీ రాముడి పేరుతో రావణుడిని పూజిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తాము ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వస్తువులపై జీఎస్టీ పెంపును విధించడాన్ని ప్రశ్నించామని ఇదెలా తప్పు అవుతుందని నిలదీశారు అధీర్ రంజన్ చౌదరి.
Also Read : నీతి ఆయోగ్ కు నితీష్ కుమార్ డుమ్మా