CM KCR Modi : కార్పొరేట్లకు అందలం దేశం నాశనం
మోదీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR Modi : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్లకు అందలం ఎక్కిస్తూ దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు. శనివారం ప్రగతి భవన్ లో సీఎం మీడియాతో మాట్లాడారు.
నీతి ఆయోగ్ నిరుపయోగంగా మారిందన్నారు. మోదీకి భజన చేయడం తప్ప ఇంకేమీ లేదని ధ్వజమెత్తారు. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరిలజమ్ అని ప్రశ్నించారు సీఎం.
దేశంలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారంటూ నిలదీశారు. రైల్వేలు, ఎయిర్ పోర్టులు అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
చివరకు వ్యవసాయ మార్కెట్ లను కూడా ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రధాన బ్యాంకుల నుంచి ప్రజలు దాచుకున్న డబ్బులను లక్షల కోట్లు డ్రా చేసుకుని విదేశాలకు పారి పోతున్నారని ఆరోపించారు కేసీఆర్(CM KCR) .
దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిద్ర పోతున్నారా( CM KCR Modi) అని నిలదీశారు. పేదలకు ఇచ్చే పథకాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు సీఎం. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని(PM Modi) ప్రధానంగా టార్గెట్ చేశారు.
ఆర్థిక నేరగాళ్లకు, కార్పొరేట్ దొంగలకు రుణాలు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. ఇదేనా మేక్ ఇన్ ఇండియా అన్నారు సీఎం. తాను ముందు నుంచే టైం తీసుకుని మాట్లాడానని కానీ ఈరోజు వరకు చర్యలు లేవన్నారు.
తాను దేశం పట్ల ఎలా వ్యవహరించాలో వివరాలతో వెల్లడించానని చెప్పారు. ఈరోజు వరకు ఎనిమిది సంవత్సరాలైంది పీఎంగా కొలువు తీరి మోదీ. కానీ ఈరోజు వరకు యాక్షన్ ప్లాన్ లేకుండా పోయిందన్నారు.
Also Read : నీతి ఆయోగ్ ను బహిష్కరిస్తున్నా – కేసీఆర్