CM KCR : సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజలు వాడే అన్నింటి మీదా మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని ఇంక మిగిలింది ఒక్క గాలి మాత్రమే మిగిలి ఉందని మండిపడ్డారు.
ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేసిన ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో సీఎం మీడియాతో మాట్లాడారు.
ముందు కోట్లాది ప్రజలు నిత్యం వాడే పాలపై జీఎస్టీ విధించడం ఘోరమన్నారు. రాను రాను గాలితో పాటు జుట్టుపై కూడా పన్ను విధిస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
వెంటనే వీటిపై ఎత్తి వేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బీడీ కంపెనీలపై కూడా జీఎస్టీ విధించడం అన్యాయం. వాటిపై ఆధారపడిన కార్మికులు లక్షలాది మంది ఉన్నారని పేర్కొన్నారు.
దేశంలో కోట్లాది మంది చేనేత కార్మికులు ఉన్నారని వారి పొట్ట కొట్ట వద్దంటూ కోరారు సీఎం(CM KCR). చేనేత పరిశ్రమ పూర్తిగా కష్టాలలో ఉందని దానిపై కూడా జీఎస్టీ విధించడం న్యాయం కాదన్నారు.
ఇది పూర్తిగా అసంబద్దమైన చర్యగా పేర్కొన్నారు. రోజు రోజుకు ఈ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతోందని రాను రాను బతికే పరిస్థితులు లేకుండా పోయాయని మండిపడ్డారు.
మోదీ(PM Modi) ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు శ్రీలంక లో చోటు చేసుకున్న సంక్షోభం రాక తప్పదని హెచ్చరించారు. విచిత్రం ఏమిటంటే గర్భా డ్యాన్సుల వేడుకలపై కూడా జీఎస్టీ విధించడం అన్యాయం అని అన్నారు.
మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 54 వేల కోట్లలో 25 వేల కోట్ల కోత విధించారంటూ మండిపడ్డారు కేసీఆర్.
Also Read : కూల్చడం కంటే రూపాయిపై ఫోకస్ పెట్టండి