Muslim Students : రామాయణ క్విజ్ లో ముస్లిం విద్యార్థుల సత్తా
మహమ్మద్ బాసిత్ ..మహమ్మద్ జబీర్ గెలుపు
Muslim Students : భారతీయులు గర్వ పడేలా ముస్లిం విద్యార్థులు సత్తా చాటారు. రామాయణ క్విజ్ లో గెలుపొంది సత్తా చాటారు. ప్రస్తుతం కొనసాగుతున్న రామాయణ మాసం సందర్భంగా గత నెలలో ఆన్ లైన్ లో క్విజ్ నిర్వహించారు.
ఈ క్విజ్ ను మహమ్మద్ బాసిత్ ఎం , మహమ్మద్ జబీర్ గెలుపొందారు. ఈ ఇద్దరు తమ ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. అంతే కాదు హిందువులు గర్వ పడేలా తమను తాము నిరూపించుకున్నారు.
రామాయణ ఇతిహాసంలో మీకు ఇష్టమైన శ్లోకం గురించి మహ్మద్ బాసిత్ ని అడిగితే ఈ ముస్లిం యువకుడు రెండో ఆలోచన లేకుండా అయోధ్య కాండ నుండి లక్ష్మణుడి కోపాన్ని, శ్రీరాముడి ఓదార్పుని తన సోదరుడికి వివరిస్తూ పద్యాలు ఘంటాపథంగా చెబుతాడు.
రామానుజన్ ఎజ్హుతాచన్ రచించిన రామాయణ ఇతిహాసాన్ని మలయాళ సంస్కరణ అయిన ఆధ్యాత్మ రామాయణం శ్లోకాలను సరళంగా అందిస్తున్నాడు. పవిత్ర పంక్తుల అర్థాన్ని, సందేశాన్ని కూడా వివరించాడు.
గొప్ప ఇతిహాసంలో ఈ లోతైన జ్ఞానం బాసిత్ , అతడు కాలేజీలో చదువుకుంటున్న సహచరుడు మహమ్మద్ జబీర్(Muslim Students) ప్రధాన పుస్తకాలను ప్రచురించారు.
ఇటీవల ఆన్ లైన్ లో నిర్వహించిన రామాయణ క్విజ్ పోటీలో విజేతలుగా నిలిచేందుకు సహాయ పడింది.
ఉత్తర కేరళ జిల్లాలలోని వాలంచచేరిలో ఉన్న కేకేఎస్ఎం ఇస్లామిక్ , ఆర్ట్స్ కాలేజీలో ఎనిమిదేళ్ల కోర్సు అయిన వాఫీ ప్రోగ్రామ్ లో వరుసగా ఐదో, చివరి సంవత్సరం విద్యార్థులు బాసిత్ , జబీర్ క్విజ్ లో ఐదుగురు విజేతలలో వీరు ఉన్నారు.
Also Read : వ్యవసాయం ఆధునీకరణ అవసరం – మోదీ