Arvind Kejriwal : అవినీతికి బీజేపీ కేరాఫ్ – కేజ్రీవాల్
కల్తీ మద్యానికి అండదండలు
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో 27 ఏళ్లుగా పాలిస్లున్నా ఈరోజు వరకు ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో విఫలమయ్యారంటూ ధ్వజమెత్తారు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతికి బీజేపీ కేరాఫ్ మారిందని ధ్వజమెత్తారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సర్కార్ పై మండిపడ్డారు. ఇన్నేళ్లు బీజేపీకి మీరు అవకాశం ఇచ్చారు కానీ ఒక్కసారి ఆప్ కు చాన్స్ ఇవ్వాలని కోరారు.
ఉచితంగా విద్య, వైద్యం అందజేస్తామన్నారు. కనీస వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలను అరికడతామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ను అమలు చేస్తామన్నారు. పంచాయతీ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింప చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఉపాధి అన్నది ప్రధాన సమస్య. దానిని కల్పించే బాధ్యత తమదేనని అన్నారు. గుజరాత్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చీఫ్ గా సీఎంకు బదులుగా గిరిజనుడినే నియమిస్తామని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఆప్ నిజాయతీకి మారు పేరు కాగా బీజేపీ అవినీతికి అందలం అని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆప్ , బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఈరోజు వరకు గిరిజనులలో మార్పు రాలేదని దీనికి బీజేపీనే కారణమన్నారు.
Also Read : వ్యవసాయం ఆధునీకరణ అవసరం