Supriya Shrinate : దైవం పేరుతో బీజేపీ భూ దందా

నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ

Supriya Shrinate : అయోధ్యలో భారీగా భూ అవినీతి జ‌రిగిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. యూపీకి చెందిన కొంద‌రు బీజేపీ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌న్న విష‌యాన్ని సుప్రీంకోర్టు త‌ప్ప‌నిస‌రిగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

రామాల‌య నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున విరాళాల‌ను సేక‌రించింద‌ని ఆరోపించింది. అయోధ్య భూమిపై భారీ అవినీతి చోటు చేసుకుంద‌ని జూన్ 2021 నుండి ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూనే వ‌స్తున్నామ‌ని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి సుప్రియా శ్రీ‌నాటే(Supriya Shrinate).

రామ జ‌న్మ భూమి ట్ర‌స్ట్ కు వ‌చ్చిన విరాళాలు ఎవ‌రెవ‌రు ఇచ్చారో ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇది ఏ ల్యాండ్ మాఫియా చేసింద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే.

అయోధ్య‌లో మాఫియాలుగా మారిన బీజేపీ నేత‌లని యూపీఏ ప‌రిధిలోని అయోధ్య డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ దీనికి అంగీక‌రించాల్సి వ‌చ్చింద‌న్నారు. సోమ‌వారం సుప్రియా శ్రీ‌నాటే(Supriya Shrinate) మీడియాతో మాట్లాడారు.

భూ అవినీతికి కేసులో 40 మంది పేర్ల‌ను విడుద‌ల చేసిన జాబితా గురించి ఆమె ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అయోధ్య లోని బీజేపీ ఎమ్మెల్యే వేద్ ప్ర‌కాశ్ గుప్తా, మేయ‌ర్ రిషి కేష్ ఉపాధ్యాయ , మాజీ ఎమ్మెల్యే గోర‌ఖ్ నాథ్ పేర్లు ఉన్నాయ‌ని ఆరోపించారు.

ఈ కేసుకు సంబంధించి మూడు కీల‌క అంశాలు ఎత్తి చూపారు ఆమె. మొద‌ట బీజేపీ చౌక ధ‌ర‌ల‌కు భూమిని కొనుగోలు చేసింద‌న్నారు. వాటిని ట్ర‌స్ట్ కు ఎక్కువ ధ‌ర‌కు విక్ర‌యించంద‌ని ఆరోపించారు.

ద‌ళితుల నుండి అనేక ప్లాట్లు అక్ర‌మంగా లాక్కున్నారంటూ వాపోయారు. ఇవి న్యాయ విచార‌ణ‌లో ఉన్నాయ‌న్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించాలంటూ డిమాండ్ చేశారు.

Also Read : అవినీతికి బీజేపీ కేరాఫ్ – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!