India Myanmar Border : భార‌త స‌రిహ‌ద్దు వ‌ద్ద కాల్పుల మోత‌

మిలిటెంట్ల..బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు

India Myanmar Border :  దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని భార‌త్ – మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో రెండో చోట్ల ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు (ఉగ్ర‌వాద సంస్థ‌లు) భార‌త దేశానికి సంబంధించిన ఈనెల‌లో జ‌రిగే 15 ఆగ‌స్టు స్వాత్రంత్ర దినోత్స‌వ వేడుక‌లు బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ రెండు చోట్ల చోటు చేసుకున్న రెండు ప్ర‌దేశాల‌లో మిలిటెంట్లు, బ‌ల‌గాల మ‌ధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ షూటౌట్ లో జూనియ‌ర్ క‌మీష‌న్డ్ అధికార చేతికి స్వ‌ల్ప గాయమైంది.

మొదటి ఘ‌ట‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని పాంగ్ సౌ పాస్ స‌మీపంలో చోటు చేసుకుంది. తిర‌ప్ చాంగ్లాంగ్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున భార‌త్ – మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులో(India Myanmar Border) అస్సాం రైఫిల్స్ సిబ్బందిపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారంటూ ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఆగ‌స్టు 15కి ముందు భ‌ద్ర‌త‌ను పెంచ‌డంలో భాగంగా ఆర్మీ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపింది. అయితే మిలిటెంట్ గ్రూపులు దాడికి పాల్ప‌డ్డాయ‌ని, కాల్పుల‌కు పాల్ప‌డ్డారంటూ వెల్ల‌డించింది.

ఇక మ‌రో ఘ‌ట‌న నాగాలాండ్ లోని నోక్ల‌క్ జిల్లాలో రెండో కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న‌పై ఆర్మీ అప్ర‌మ‌త్త‌మైంది. ఎక్క‌డిక‌క్క‌డ బ‌ల‌గాల‌ను మోహ‌రించింది.

ఇదిలా ఉండ‌గా ఈశాన్య రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. హోం శాఖ ఆరా తీసింది. ప‌రిస్థితి గురించి ర‌క్ష‌ణ‌, హోం శాఖ మంత్రులకు వివ‌రాలు తెలిపిన‌ట్లు స‌మాచారం.

Also Read : ఎఫ్‌బీఐ దాడిపై భ‌గ్గుమ‌న్న డొనాల్డ్ ట్రంప్

Leave A Reply

Your Email Id will not be published!