Maharashtra New Cabinet : మరాఠా మంత్రివర్గం చెరీ సమానం
షిండే వర్గం నుంచి 9 బీజేపీ నుంచి 9
Maharashtra New Cabinet : ఎట్టకేలకు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మరాఠా సర్కార్ కేబినెట్(Maharashtra New Cabinet) కొలువుతీరింది. ఎంతో ఉత్కంఠకు తెర తీసిన మంత్రివర్గం పూర్తయింది.
ఈ మేరకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేతుల మీదుగా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారనే దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు రేగాయి.
కానీ ఈ లిస్టును అమిత్ షాకు చూపించిన తర్వాతే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి విభేదాలు రాకుండా ఉండేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నించినట్లు కనిపిస్తోంది.
శివసేనలో తిరుగుబాటు జెండా ఎగుర వేసి సీఎంగా కొలువు తీరిన షిండే వర్గానికి 9 మంది, ఇక బీజేపీ వర్గానికి 9 మందిని చేర్చారు కేబినెట్ లో. దీంతో మంత్రివర్గం చెరీ సమానంగా నిలిచింది.
మొత్తం 18 మందితో కొలువు తీరింది మరాఠా ప్రభుత్వం. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రుల పరంగా చూస్తే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం నుంచి చంద్రకాంత్ పాటిల్ , సుధీర్ మునగంటి వార్, గిరీష్ మహాజన్ , సురేష్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్ , రవీంద్ర చవాన్ , మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సేవ్ ఉన్నారు.
ఇక సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం నుంచి దాదా భుసే, శంభురాజ్ దేశాయ్ , సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్ తానాజీ సావంత్ , అబ్దుల్ సత్తార్ , దీపక్ కేసర్కర్ , గులాబ్ రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ ఉన్నారు.
Also Read : గవర్నర్ ను కలవనున్న నితీష్ కుమార్