Ruchira Kamboj : చైనా ద్వంద్వ వైఖరిపై భారత్ ఆగ్రహం
యుఎన్ లో శాశ్వత ప్రతినిధి సీరియస్
Ruchira Kamboj : ఉగ్రవాదం పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది భారత్. ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా ఉన్న డ్రాగన్ దాయాది పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని తప్పు పట్టింది.
పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని జాబితా చేయాలంటూ బారత్ యుఎస్ సంయుక్త ప్రతిపాదనపై చివరి క్షణంలో నిలుపుదల చేసింది.
ఉగ్రవాదులపై ద్వంద్వ ప్రమాణాలను నిందించారు ఐక్య రాజ్య సమితి లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్(Ruchira Kamboj) . బీజింగ్ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ప్రపంచంలోని అత్యంత పేరు మోసిన ఉగ్రవాదుల్లో కొందరిని బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు.
సాక్ష్యాధారాల ఆధారిత ప్రతిపాదనలు నిలిపి వేయడాన్ని విచారకరమని పేర్కొంది. కౌన్సిల్ ఆంక్షల పాలన విశ్వసనీయతను దెబ్బ తీసేలా ఉందన్నారు.
లిస్టింగ్ అభ్యర్థనలపై ఎటువంటి సమర్థన లేకుండా హోల్డ్ లు , బ్లాక్ లను ఉంచే పద్దతికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు రుచిరా కాంబోజ్.
ఆంక్షల కమిటీల సమర్థవంతమైన పనితీరుకు అవి మరింత పారదర్శకంగా , జవాబుదారీగా , లక్ష్యంతో మారడం అవసరమని స్పష్టం చేశారు.
ఎలాంటి సమర్థన ఇవ్వకుండా ఎలా చేస్తారంటూ చైనాను నిందించారు. ఉగ్రవాద చర్యల వల్ల అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు అనే అంశంపై యుఎన్ భద్రతా మండలి సమావేశంలో మాట్లాడారు రుచిరా కాంబోజ్.
ప్రపంచంలోని అత్యంత పేరు మోసిన ఉగ్రవాదులకు ఎలా చైనా సమర్థిస్తుందని నిలదీశారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఈ తరుణంలో భారత్ టార్గెట్ చేయడం విశేషం.
Also Read : చైనాపై ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సే ఫైర్