Arvind Kejriwal : గెలిపిస్తే గుజరాత్ కు గ్యారెంటీ స్కీం
ప్రకటించనున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : త్వరలో గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని డిసైడ్ అయ్యారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఇప్పటికే ఢిల్లీతో పాటు పంజాబ్ లో పాగా వేసింది పార్టీ. ఇక మెల మెల్లగా జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు గుజరాత్ ను చుట్టుముట్టారు.
ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం నుంచి స్పందన లభిస్తోంది. గత 27 సంవత్సరాలుగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆప్ కు అధికారం అప్పగిస్తే గుజరాత్ ను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే విద్య, వైద్యం, ఉపాధి అన్నది తమ ప్రధాన డిమాండ్ అని ప్రకటించారు. కార్పొరేట్లు, వ్యాపారస్తులకు కాకుండా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడతామని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
ఆగస్టు 10న మరో కీలక సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉంటుందని ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్.
కేవలం మాటలు, హామీలు మాత్రమే ప్రకటిస్తూ వచ్చారని కానీ తాము ఆచరణలో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు ఆప్ చీఫ్. ఇకనైనా ప్రజలు మారాలని పిలుపునిచ్చారు.
Also Read : లాలూ..రబ్రీజీ నన్ను మన్నించండి – నితీశ్