Prashant Kishor : సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమి ఎఫెక్ట్
ప్రొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
Prashant Kishor : భారత దేశ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. బీహార్ లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు.
బీజేపీతో 17 ఏళ్ల అనుబంధాన్ని కాదనుకున్నారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ , ఇతర పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడ్డారు.
ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీహార్ లో సీఎంగా మళ్లీ ఎనిమిదోసారి నితీశ్ కుమార్ కొలువు తీరగా డిప్యూటీ సీఎంగా ఆర్జీడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు.
ఇదిలా ఉండగా బీజేపికి చెక్ పెట్టి మహా కూటమిగా ఏర్పడడం రాబోయే భారత దేశ రాజకీయాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు ప్రశాంత్ కిషోర్.
త్వరలో దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై పూర్తి ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే కొద్ది నెల్లో బీహార్ లో మహా కూటమి 2.0 ఎలా పని చేస్తోందో అనేది చూడాలన్నారు.
అంతకు ముందు నితీశ్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ లో భాగంగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న రాష్ట్రంలో ఒక రోజు హై డ్రామా తర్వాత నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు నుండి వైదొలిగారు.
రాష్ట్రీయ జనతాదళ్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణం బాగా చేయగలిగితే అది బలీయమైన శక్తి అవుతుంది. వారు బాగా పరిపాలించక పోతే అది ప్రతికూలంగా ఉంటుందన్నారు.
Also Read : అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్ షాక్