CAG Trusts : ట్రస్టుల నిర్వాకంపై కడిగేసిన కాగ్
21 వేల ట్రస్టులు రూ. 18,800 కోట్లు
CAG Trusts : ఈ దేశంలో సేవ పేరుతో స్వాహా పర్వం మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 21 వేల ట్రస్టులు అక్షరాలా రూ. 18,800 కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి.
ఒక రకంగా చెప్పాలంటే టాక్స్ మినహాయింపులు పొందాయి. అంటే ఈ డబ్బులన్నీ దొబ్బేసినట్లేనన్న మాట. ఇది మనం చెబుతున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కుండ బద్దలు కొట్టింది.
తాజాగా అందజేసిన నివేదికలో బట్టబయలు చేసింది. విచిత్రం ఏమిటంటే రిజిస్టర్ కాని సంస్థలు కూడా ఉన్నాయంటూ బాంబు పేల్చింది. ఇందులో భాగంగా 347 ట్రస్టులు, ఎఫ్సీఆర్ఏ నమోదు చేసుకోక పోవడం గమనార్హం.
కానీ అలా రిజిస్టర్ చేసుకోకుండా ఎలా విరాళాలు పొందాయో ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ అడ్డగోలు విరాళాలు విదేశాల నుంచి పొందడం గమనార్హం.
ఇక ఈ వేల కోట్లల్లో లబ్ది పొందిన ట్రస్టులలో దేశ రాజధాని ఢిల్లీకి చెందినవే ఉండడం విశేషం. ఇందులో 1345 సంస్థలు ఉన్నాయి. మరాఠాలో అత్యధికంగా 3,745 ట్రస్టులు ఏకంగా 2, 500 కోట్లు మినహాయింపు పొందాయి.
యూపీలో 2,100 ట్రస్ట్ లు రూ. 1800 కోట్లు టాక్స్ బెనిఫిట్స్ పొందాయి. ఎంపీలో 770 ట్రస్టులు 1,595 కోట్లు కొల్లగొట్టాయి. గుజరాత్, ఆంధ్ర, కర్ణాటకలలో ట్రస్టుల్ రూ. 1,000 కోట్లకు పైగా మినహాయింపు పొందడం విశేషం.
ఇదిలా ఉండగా ఏదైనా ట్రస్టు లేదా స్వచ్చంధ సంస్థ(CAG Trusts) విదేశీ విరాళాలు పొందాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సీఆర్ఏ పొందాల్సి ఉంటుంది.
ఇక కాగ్ దర్యాప్తులో విరాళాల్లో కర్ణాటక టాప్ లో ఉంటే ఏపీ, తెలంగాణ తదుపరి స్థానంలో ఉండడం విస్తు పోయేలా చేసింది.
Also Read : రేషన్ లేక పోవడం సిగ్గు చేటు