Nitish Kumar : సీఎం..డిప్యూటీ సీఎంలుగా నితీష్..తేజస్వి
డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్
Nitish Kumar : బీహార్ రాష్ట్రానికి ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్(Nitish Kumar). నిన్న భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తును వద్దనుకున్నారు.
తాజాగా ప్రతిపక్షాలకు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్ , సీపీఐఎంఎల్ పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ (మహా కూటమి)గా ఏర్పాటయ్యాయి. ఈ మేరకు గవర్నర్ కు తమ బలాన్ని నిరూపించారు.
ఆపై అక్కడి నుంచి నేరుగా లాలూ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవికి తనను మన్నించమని కోరారు.
ఇక ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్ రాష్ట్ర చరిత్రలో ఎనిమిదో సారి సీఎం కావడం ఓ రికార్డ్. 2020 ఫలితాల తర్వాత తాను సీఎంను కావాలని అనుకోలేదన్నారు.
కానీ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. పార్టీలోని వారిని ఏ స్థాయికి దిగజార్చారో అడగడండి. అప్పుడు ఏం జరిగిందో మీరే చూడండన్నారు. 2015లో ఎన్ని సీట్లు గెలిచామో ఆ తర్వాత అదే వాళ్లతో కలిసి వెళ్లి మమ్మల్ని ఏ స్థాయికి దిగజార్చారో చూసుకోవాలన్నారు.
ప్రజలను నిరాశ పరిచి వారి ఆదేశానికి ద్రోహం చేశారన్న బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు నితీశ్ కుమార్. నేను ఉంటానో లేదో వదిలేయండి ముందు ప్రజలు చెప్పేది వినండి అని అన్నారు సీఎం.
ఇదిలా ఉండగా ఇవాళ పాట్నాలో బీజేపీ భారీ నిరసన చేపడతామని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ నితీష్ కుమార్ ను క్షమించరన్నారను బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్.
Also Read : మోదీ 2014లో గెలిచారు 2024లో గెలుస్తారా