CM Nitish Kumar : మోదీ 2014లో గెలిచారు 2024లో గెలుస్తారా
ప్రధాన మంత్రిపై నితీశ్ కుమార్ సెటైర్
CM Nitish Kumar : భారతీయ జనతా పార్టీతో 17 ఏళ్ల పాటు కొనసాగిస్తూ వచ్చిన బంధాన్ని తెంచేసుకున్నారు జేడీయూ చీఫ్ , సీఎం నితీశ్ కుమార్. ఆయన కొత్తగా ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో జతకట్టారు.
ఆపై మహా కూటమి పేరుతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ రాష్ట్ర చరిత్రలో ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం నితీశ్ కుమార్. ఇది ఓ రికార్డుగా చెప్పక తప్పదు.
సీఎంగా కొలువు తీరిన అనంతరం నితీశ్ కుమార్(CM Nitish Kumar) సంచలన కామెంట్స్ చేశారు. నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ప్రధానిగా 2014లో గెలిచారు సరే 2024లో గెలుస్తారని నమ్మకం ఏంటి అని ప్రశ్నించారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ని గద్దె దించేందుకు ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని చెప్పారు. కానీ తాను ప్రధాన మంత్రి పదవిని ఆశించడం లేదన్నారు.
తాను మిత్ర ధర్మాన్ని పాటించానని అన్నారు. కానీ స్నేహానికి ద్రోహం తలపెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కానీ తాను ముందుగా తేరుకోక పోయి ఉంటే మరాఠాలో చోటు చేసుకున్న ఘటన ఇక్కడ జరిగి ఉండేదన్నారు.
బీజేపీకి ఒక్కరికే తెలివి తేటలు అంటూ ఉంటాయని అనుకుంటే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు. ఎవరు ప్రజలకు ద్రోహం తలపెట్టారో బీహారీయులకు తెలుసన్నారు.
తన పార్టీలోని వ్యక్తితో తననే తిట్టించి, ఆపై తిరుగుబాటు జెండా ఎగుర వేయిద్దామని అనుకున్నారని కానీ వారి ఆటలు నా వద్ద సాగవన్నారు.
ఇలాంటి రాజకీయాలను తాను ఎన్నో చూశానని అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పానని స్పష్టం చేశారు సీఎం నితీశ్ కుమార్.
Also Read : ట్రస్టుల నిర్వాకంపై కడిగేసిన కాగ్