Congress Chief : 21న కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నిక

రాహుల్ గాంధీ మౌనం దేనికోసం

Congress Chief : త్వ‌ర‌లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ దూసుకు పోతోంది. దానిని ఢీకొనాలంటే కాంగ్రెస్ మ‌రింత ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది.

వ‌య‌స్సు మీద ప‌డ‌డంతో పార్టీ చీఫ్ గా ఉండ‌డం సోనియా గాంధీకి ఇబ్బంది క‌రంగా భావించాలి. ఈ త‌రుణంలో ఆగ‌స్టు 21న కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ కీల‌క స‌మ‌యంలో రాహుల్ గాంధీ మౌనం పాటించారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రాజ‌యం త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. మ‌రోసారి పార్టీ చీఫ్ కావాలంటూ కాంగ్రెస్ నేత‌లు చేసిన అభ్య‌ర్థ‌న‌ల‌కు ఎలాంటి స్పంద‌న రాలేదని స‌మాచారం.

త‌న త‌ల్లి సోనియా గాంధీ సార‌థ్యం వ‌హిస్తున్న ఈ ప‌ద‌వికి తాను పోటీ చేస్తానంటూ రాహుల్ గాంధీ వెళ్ల‌డించ‌లేదు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ చీఫ్(Congress Chief) గా గాంధీయేత‌ర నేత ఉండే అవ‌కాశాంపై ఆ పార్టీ చాలా కాలాంగా చ‌ర్చిస్తోంది.

ఈ విష‌యంలో ఇంకా పార్టీలో ఏకాభిప్రాయం కుద‌ర‌లేద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఫ్యాక్ష‌నిజంతో కొట్టు మిట్టాడుతున్న పార్టీపై గాంధీల ప్ర‌భావం ఏకీకృతంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇక పార్టీకి సంబంధించిన డ్రైవ‌ర్ సీటులో గాంధీని కూర్చో బెట్టాల‌ని కాంగ్రెస్ లోని పెద్ద సెక్ష‌న్ నాయ‌కులు కోరుకుంటున్నార‌ని స‌మాచారం.

మార్చిలో పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రాజ‌యాల గురించి చ‌ర్చించేందుకు జ‌రిగిన మీటింగ్ లో సోనియా గాంధీ చేసిన ప్ర‌సంగంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో క‌లిసి రాజీనామా చేసేందుకు ప్ర‌తిపాదించారు.

2017లో త‌న త‌ల్లి నుండి పార్టీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాహుల్ గాంధీ హ‌యాంలో 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 543 స్థానాల‌కు గాను 52 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది కాంగ్రెస్.

దీంతో తాను ఉండ‌నంటూ ప్ర‌క‌టించాడు. ఈ కీల‌క స‌మ‌యంలో ఎవ‌రుంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : జెండా..రేష‌న్ లేక పోవ‌డం సిగ్గు చేటు

Leave A Reply

Your Email Id will not be published!