Sharad Pawar : నితీశ్ కుమార్ ది తెలివైన నిర్ణ‌యం – ప‌వార్

బీజేపీ మిత్ర‌ప‌క్షాల‌ను ముగించింద‌ని కామెంట్

Sharad Pawar :  భార‌తీయ జ‌న‌తా పార్టీతో 17 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని మంచి ప‌ని చేశారంటూ జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్.

ఒక ర‌కంగా ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. మ‌రాఠాలో ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన మ‌హా వికాస్ అఘాడీని కూల్చేశారు.

కానీ సేమ్ సీన్ బీహార్ లో వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.

ఒక ర‌కంగా బీజేపీని వ‌దులు కోవ‌డం వ‌ల్ల నితీశ్ కుమార్ కు మేలు జ‌రిగింద‌న్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, త‌దిత‌ర పార్టీలతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పారు.

బుధ‌వారం ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar) మీడియాతో మాట్లాడారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ పై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ త‌న ప్రాంతీయ మిత్ర‌ప‌క్షాల‌ను క్ర‌మంగా అంతం చేస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు ప‌వార్.

శివ‌సేన‌ను ఎలా బ‌ల‌హీన ప‌ర్చాలి, పార్టీలో చీలిక‌ను ఎలా సృష్టించాల‌నే దానిపై బీజేపీ ఆలోచిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా మ‌రాఠా లో ఏక్ నాథ్ షిండేను ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వాన్ని ఎలా కూల్చిందో సేమ్ ప్లాన్ ను బీహార్ లో చేయాల‌ని చూసింద‌న్నారు,

జేడీయూలో కీల‌క నేత‌ను ప్రోత్స‌హించి నితీశ్ కుమార్ కు చెక్ పెట్టాల‌ని చూసింద‌ని కానీ వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు. అక్క‌డ ఉన్న‌ది త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కుడ‌ని అమిత్ షా గుర్తించ లేక పోయార‌న్నారు.

Also Read : క‌ర్ణాట‌క సీఎంను మార్చే ప్ర‌సక్తి లేదు

Leave A Reply

Your Email Id will not be published!