Jyotiraditya Scindia : విమాన ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్

టికెట్ ధ‌ర‌ల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

Jyotiraditya Scindia : కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. విమాన ప్ర‌యాణీకుల‌కు మేలు చేకూరేలా నిర్ణ‌యం తీసుకుంది. దీని వ‌ల్ల విమాన టికెట్ ధ‌ర‌లు త‌గ్గనున్నాయి.

క‌రోనా కాలంలో ఎయిర్ లైన్స్ సంస్థ‌ల‌పై ప్రైస్ బ్యాండ్ లు విధించింది. దీనిని ఎత్తి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశీయ మార్గాల‌లో ప్ర‌యాణం చేసే వారికి కొంత మేలు చేకూర‌నుంది.

చార్జీల‌పై ఉన్న ప‌రిమితుల‌ను తొల‌గించినట్లు పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కాగా ఈ తీసుకున్న నిర్ణ‌యం ఆగ‌స్టు 31 నుంచి అమ‌లు లోకి రానుంద‌ని ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు అధికారికంగా ధ్రువీక‌రించింది. గ‌తంలో ప్ర‌యాణ చార్జీల‌పై తుది నిర్ణ‌యం కేంద్ర స‌ర్కార్ ఆధీనంలో ఉండేది. కానీ దానిని కూడా ఎత్తేసింది.

దీనికి సంబంధించి కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) స‌మీక్ష చేప‌ట్టారు. దీని వ‌ల్ల ఆయా ఎయిర్ లైన్స్ సంస్థ‌లు త‌మ ఇష్టానుసారం పెంచ‌వ‌చ్చు లేదా త‌గ్గించేందుకు వీలు ఉండేలా మార్చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ప‌డితే అలా ప్ర‌యాణీకుల‌పై మోత మోగించాయి విమాన‌యాన సంస్థ‌లు.  త‌మ‌కు అడ్డు అదుపు లేకుండా ప్ర‌వ‌ర్తించాయి. ఒకానొక స‌మ‌యంలో వాటిపై నియంత్ర‌ణ కోల్పోయిందేమోన‌న్న అనుమానాలు త‌లెత్తాయి.

మ‌రో వైపు ఎయిర్ లైన్స్ మ‌ధ్య పోటీ పెరిగి చార్జీలు త‌గ్గించే చాన్స్ కూడా ఉండ‌నుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఎయిర్ లైన్స్ సంస్థ‌లు ప్ర‌యాణీకుల ప‌ట్ల వివ‌క్షా పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ మ‌ధ్య‌న సాంకేతిక వైఫ‌ల్యాల‌తో ప్ర‌యాణీకులు ఇబ్బందులు ప‌డిన దాఖాలాలు కోకొల్ల‌లు.

Also Read : ఎంపీకి క్లీన్ చిట్ వీడియో బ‌క్వాస్

Leave A Reply

Your Email Id will not be published!