Arvind Kejriwal : మ‌హిళ‌ల‌కు ఆప్ బంప‌ర్ ఆఫర్

18 ఏళ్లు నిండిన వారికి పెన్ష‌న్

Arvind Kejriwal :  గుజ‌రాత్ లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. గ‌త 27 ఏళ్లుగా గుజ‌రాత్ లో పాగా వేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఆ పార్టీపై యుద్దం ప్ర‌క‌టించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

ఇప్ప‌టి నుంచే ఫోక‌స్ పెట్టారు ఆ రాష్ట్రంపై. ప‌లు మార్లు ప‌ర్య‌టించారు. విస్తృతంగా తిరుగుతూ ప్ర‌జ‌ల‌కు హామీలు ఇస్తున్నారు. ప‌నిలో ప‌నిగా కొలువుతీరిన కాషాయ స‌ర్కార్ పై బాణాలు విసురుతున్నారు.

ఇన్నేళ్ల పాటు పాలించిన బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతే కాదు శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కోరారు కేజ్రీవాల్. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని అన్ని పార్టీల కంటే ముందే ఆప్ స్టార్ట్ చేసింది.

ఇదే స‌మ‌యంలో ఒక్క‌సారి త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదే స్లోగ‌న్ తో పంజాబ్ లో ఎంట్రీ ఇచ్చారు. అక్క‌డ భారీ మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

పంజాబ్ సీఎంగా భ‌గ‌వంత్ మాన్ కొలువు తీరారు. అవినీతి అక్ర‌మాల‌కు తావు లేకుండా ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. ప‌లువురిపై చ‌ర్య‌లు తీసుకున్నారు.

ఇదే స‌మ‌యంలో గుజ‌రాత్ లో కూడా ఢిల్లీ మోడ‌ల్ స‌ర్కార్ తీసుకు వ‌స్తామ‌ని హామీ ఇస్తున్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal). విద్య‌, వైద్యం, ఉపాధి క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఆప్ చీఫ్‌. ఆప్ కు అధికారం అప్ప‌గిస్తే రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన ప్ర‌తి మహిళ‌కు రూ. 1,000 చొప్పున పెన్ష‌న్ అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Also Read : కొలువు తీరనున్న జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!