Bihar New Cabinet : బీహార్ లో సీఎంకే దక్కనున్న హోం
కొత్త కేబినెట్ లో కీలక పదవులపై ఫోకస్
Bihar New Cabinet : భారత దేశ రాజకీయాలలో కొత్త కుదుపుగా భావించాలి బీహార్ లో చోటు చేసుకున్న ఊహించని పరిణామాలు. పాలిటిక్స్ లో ఇవి సర్వ సాధారణమే అయినప్పటికీ త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో బీహార్ మోడల్ ఎలాంటి ప్రభావం చూపబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక బీజేపీకి చెక్ పెట్టి ఆర్జేడీతో జత కట్టిన నితీశ్ కుమార్ కొత్త కేబినెట్ పై పూర్తిగా తానే పట్టు కలిగి ఉన్నారు.
ఆ రాష్ట్రానికి ఆయనే ఎనిమిదో సారి సీఎం కావడం విశేషం. సీఎం కంటే కీలకమైన పదవిగా భావించే హోం మంత్రిత్వ శాఖను తన వద్దే ఉంచుకోనున్నట్లు టాక్. ఇక కొత్త క్యాబినెట్ లో కూటమిలో ఎవరికి ఎన్ని అనే దానిపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు టాక్.
ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఎక్కువ సీట్లు కలిగిన ఆర్జేడీకి దాదాపు 20 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇక జేడీయూకి 13 స్థానాలు లభించే చాన్స్ ఉంది.
కాంగ్రెస్ కు నాలుగు , మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన ఒకరికి కేబినెట్(Bihar New Cabinet) లో చోటు దక్కవచ్చు. ఇక హోం సీఎం వద్దే ఉండనుంది. తేజస్వి యాదవ్ కు ఆరోగ్యం, ఆర్థిక, రోడ్ల నిర్మాణం వంటి శాఖలు దక్కనున్నట్టు సమాచారం.
ఇక నితీశ్ కుమార్ కీలకమైన సీఎం, హోం శాఖలతో పాటు వెనుకబడిన కులాల, మైనార్టీల సంక్షేమానికి సంబంధించిన శాఖలు కూడా ఆయన వద్దే ఉండనున్నాయి.
గతంలో బీజేపీ తీసుకున్న శాఖలను ఆర్జేడీకి అప్పగించనున్నారు నితీశ్ కుమార్. ఇక కీలకమైన స్పీకర్ పదవి కూడా లాలూ టీంకు దక్కనుంది.
Also Read : ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి