NV Ramana : దయచేసి మాస్క్ ధరించండి – సీజేఐ
కేసులు పెరుగుతున్నాయి భద్రం
NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దయచేసి మాస్క్ ధరించాలని సూచించారు.
పెరుగుతున్న కరోనా కేసులను ఉదహరించారు. సిబ్బంది, సహోద్యోగులలో ఎక్కువ మంది దీనిని పొందుతున్నారని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే న్యాయమూర్తులు కూడా కరోనా కూడా సోకుతోందని తెలిపారు.
పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. న్యాయ విచారణ సందర్భంగా న్యాయవాదులకు పేర్కొన్నారు సీజేఐ ఎన్వీ రమణ(NV Ramana). ప్రజలకు ఉచితాలపై దాఖాలపై పిటిషన్ పై విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా ఆగస్టు 26న సీజేఐ పదవి నుంచి పదవీ విరమణ కాబోతున్నారు. ఆయన స్థానంలో సీజేఐగా యుయు లలిత కొలువు తీరనున్నారు. ఆయన కేవలం 74 రోజుల పాటు మాత్రమే ఉంటారు.
అనంతరం మరో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీజేఐగా లలిత్ నియామకంపై సంతకం చేశారు.
లాయర్లు, న్యాయవాదులు, సిబ్బందితో పాటు న్యాయమూర్తులు విధిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు ఎన్వీ రమణ. విచిత్రం తుషార్ మెహతా తాను కూడా ఎఫెక్ట్ పడిందన్నారు.
సీనియర్ ఏఎం సింఘ్వి కి పాజిటివ్ అని తేలడంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కీలక విచారణ జరుగుతోంది. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
Also Read : మోదీకి రాఖీ కట్టిన పీఎంఓ సిబ్బంది చిన్నారులు