Amit Malviya : రాబోయే రోజుల్లో మరికొందరికి షాక్
స్పష్టం చేసిన భారతీయ జనతా పార్టీ
Amit Malviya : భారతీయ జనతా పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ లో కొలువు తీరిన టీఎంసీ సర్కార్ కు షాక్ తగలనుందని బీజేపీ ప్రకటించింది.
ఇప్పటికే టీచర్ల స్కాంకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీతో పాటు ఆయన సహాయకురాలిగా ఉన్న ప్రముఖ నటి అర్షిత ముఖర్జీ కి కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).
ఆమె ఇల్లుతో పాటు ఫ్లాట్ లో దాడులకు దిగింది. సోదాలు చేపట్టింది రూ. 50 కోట్ల రూపాయల నగదుతో పాటు 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.
దీంతో పార్థతో పాటు అర్షితను అదుపలోకి తీసుకుంది. దిమ్మ తిరిగేలా మమతా బెనర్జీకి షాక్ ఇచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో పార్టీ నుంచి బహిష్కరిస్తన్నట్లు ప్రకటించారు సీఎం.
ఇదే సమయంలో ఉన్నట్టుండి మరో సీనియర్ నాయకుడు , పశువుల తరలింపు స్కాంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న అనుబ్రత మోండల్ ను మరో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇదే సమయంలో తాజాగా టీఎంసీ చీఫ్ దీదీకి మరో బిగ్ షాక్ ఇచ్చింది. బొగ్గు స్కాంలో కీలక పాత్ర పోషించారంటూ ఎనిమిది మంది బెంగాల్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు సమన్లు జారీ చేసింది ఈడీ.
ఇదిలా ఉండగా అరెస్ట్ అయిన మంత్రి పార్థ, మోండల్ లు సీఎం దీదీకి ఫోన్ చేశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. త్వరలో ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు షాక్ ఇవ్వడం ఖాయమని పేర్కొన్నారు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా(Amit Malviya).
Also Read : ముందస్తు విడుదల కోసం కోర్టుకు నళిని