Jayant Chaudhary : సీజేఐ ర‌మ‌ణ‌పై జ‌యంత్ చౌధ‌రి ఫైర్

పేద‌ల‌కు ఉచితాలు ఉండాల్సిందే

Jayant Chaudhary : ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయా రాజ‌కీయ పార్టీలు స‌ర్వ సాధార‌ణంగా లెక్క‌కు మించి హామీలు ఇస్తూ వ‌స్తాయి. వీటి ఆధారంగా త‌మ‌కు ఏదో ల‌బ్ది చేకూరుతుందోన‌న్న ఆశ‌తో ప్ర‌జ‌లు ఓట్లు వేయ‌డం, తిరిగి పాల‌కులు అధికారంలోకి రావ‌డం ప‌రిపాటిగా మారింది.

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ‌మైన భార‌త దేశంలో ఉచితాల వ‌ల్ల ప్ర‌మాదం పొంచి ఉందంటూ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

దీనిపై ఆయా పార్టీలు, పేరొందిన రాజ‌కీయ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండాల్సింది కాదన్నారు ఆర్ఎల్డీ నేత, ఎంపీ జ‌యంత్ చౌధ‌రి(Jayant Chaudhary).

ఈ దేశానికి 75 ఏళ్లై స్వాతంత్రం వ‌చ్చినా ఇంకా పేద‌లు కోట్లాది మంది ఉన్నార‌ని వారిని ఆదుకోవాల్సిన బాధ్య‌త ఏలుతున్న పాల‌కుల‌పై ఉంద‌న్నారు.

ఆయా ప్ర‌భుత్వాలు త‌మ‌కు తోచిన వారికి రాయితీలు ఇస్తున్నాయ‌ని, అంతే కాదు ఆర్థిక నేర‌గాళ్ల‌కు వంత పాడుతుంటే కోర్టు ఏం చేస్తోందంటూ ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టికే సంపాదించిన దాంట్లోంచి 2 శాతం సామాజిక బాధ్య‌త‌తో ఖ‌ర్చు చేయాల‌ని ఉంద‌ని ఈ ర‌కంగానైనా డ‌బ్బున్న వాళ్లు ఖ‌ర్చు చేస్తే ఆక‌లిని తీర్చిన వార‌వుతార‌ని పేర్కొన్నారు.

ఉచితాలు అనేవి ప్ర‌మాదం. ప్ర‌జా సంక్షేమానికి అవి గుదిబండ‌గా మారుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు జ‌యంత్ చౌద‌రి.

అణ‌గారిన వ‌ర్గాల‌కు రేష‌న్ అందించ‌డం ఉండాల‌న్నారు. వారు ఆర్థికంగా నిల‌దొక్కు కునేంత దాకా అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

Also Read : కార్పొరేట్ల‌కు అంద‌లం ప‌థ‌కాల‌కు మంగ‌ళం

Leave A Reply

Your Email Id will not be published!