Rakesh Jhunjhunwala : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా క‌న్నుమూత‌

వ్యాపార‌, రాజ‌కీయ వ‌ర్గాల దిగ్భ్రాంతి

Rakesh Jhunjhunwala : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇక లేరు. బిగ్ ఇన్వెస్ట‌ర్ గా ఇప్ప‌టికే పేరొందారు. ఆయ‌న‌ను ఇండియ‌న్ వారెన్ బ‌ఫెట్ గా పేర్కొంటారు. ఆస్ప్ర‌తిలో చికిత్స పొందుతూ ఆదివారం మ‌ర‌ణించారు.

ఆయ‌న 5 జూలై 1960లో పుట్టారు. ప్ర‌స్తుతం ఝున్ ఝున్ వాలా(Rakesh Jhunjhunwala) వ‌య‌స్సు 62 ఏళ్లు. భార‌తీయ బిలీయ‌నీర్ వ్యాపార‌వేత్త‌. స్టాక్ వ్యాపారి, పెట్టుబ‌డిదారు. త‌న ఆస్తి నిర్వ‌హ‌ణ సంస్థ‌, రేర్ ఎంట‌ర్ ప్రైజెస్ లో భాగ‌స్వామిగా ఉన్నారు.

స్వంత పోర్ట్ పోలియోను నిర్వ‌హించారు. మ‌హారాష్ట్ర‌లోని ముంబైలోని రాజ‌స్తానీ కుటుంబంలో పెరిగాడు. ఆయ‌న తండ్రి ఆదాయ‌పు ప‌న్ను క‌మిష‌న‌ర్ గా ప‌ని చేశారు.

సిడెన్ హోమ్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరాడు. ఝున్ ఝున్ వాలా నిక‌ర విలువ $5.5 బిలియ‌న్లుగా ఉంది.

జూలై 2022 నాటికి భార‌త దేశంలో 36వ అత్యంత సంప‌న్నుడిగా నిలిచారు. త‌న తండ్రి స్నేహితుల‌తో మార్కెట్ ల గురించి చ‌ర్చించ‌డం గ‌మ‌నిస్తూ వ‌చ్చాడు.

స్టాక్ మార్కెట్ ల‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. తండ్రి మార్కెట్ ల‌లో మార్గ‌నిర్దేశ‌నం చేస్తున్న స‌మ‌యంలో పెట్టుబ‌డి పెట్టేందుకు డ‌బ్బులు కూడా ఇవ్వ‌లేదు.

దీంతో రాకేష్ త‌న వ‌ద్ద ఉన్న పొదుపుతో కాలేజీలో ఉన్న‌ప్పుడే పెట్టుబ‌డి పెట్ట‌డం ప్రారంభించాడు. 1985లో రూ. 5,000 మూల ధ‌నంతో ప్రారంభించాడు.

ఇవాళ ఆయ‌న ఆస్తి రూ. 11,000 కోట్ల‌కు పెరిగింది. యాక్టివ్ గా ఇన్వెస్ట‌ర్ గా ఉండ‌డంతో పాటు ఆప్టెక్ లిమిటెడ్ , హంగామా డిజిట‌ల్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మ‌న్ గా ఉన్నారు.

ప‌లు కంపెనీల‌ను స్థాపించారు, చైర్మ‌న్ గా ఉన్నారు. బోర్డు మెంబ‌ర్ గా ప‌ని చేశారు. మొత్తంగా భార‌తీయ వ్యాపార‌వేత్త‌ను కోల్పోవ‌డం బాధాక‌రం.

Also Read : డ్యుయిష్ బ్యాంక్ మాజీ సీఇఓ ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!