Balakrishna : అబ్బాయికి బాబాయి అభినంద‌న

బింబిసార మూవీని చూసిన హీరో

Balakrishna : ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన సోషియో ఫాంట‌సీ మూవీ బింబిసార‌ను థియేట‌ర్ లో వీక్షించారు.

ఈ సంద‌ర్బంగా అద్భుతంగా న‌టించావంటూ అన్న కొడుకు క‌ళ్యాణ్ రామ్ ను అభినందించారు. ప‌టాస్ హిట్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ సినిమా రాలేదు క‌ళ్యాణ్ రామ్ కు. కానీ బింబిసార పై ఎక్కువ ఫోక‌స్ పెట్టాడు.

దీంతో చిత్రం విడుద‌లైన నాటి నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. భారీ క‌ల‌క్షెన్ల‌తో దూసుకు పోతోంది. మ‌ళ్లీ స‌క్సెస్ అందుకోవ‌డానికి ఎనిమిది సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

క‌ళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో బింబిసార మూవీ బిగ్ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొట్టింది. మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవ‌డం విశేషం. చిత్రంలో త‌న‌కు ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేశాడు క‌ళ్యాణ్ రామ్(Kalyan Ram).

ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ మ‌రో అసెట్ గా మారింది బింబిసార‌కు. ఈ మూవీ ఆగ‌స్టు 5న విడుద‌లైంది. అన్ని చోట్లా ఆద‌ర‌ణ ల‌భించింది.

బాక్సాఫీసులు క‌ళ‌క‌ళ మంటున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం బింబిసార చిత్రాన్ని చూశారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.

తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ(Balakrishna) బింబిసార చిత్రాన్ని వీక్షించాడు. ఆయ‌న‌తో పాటు సినీ ద‌ర్శ‌కుడితో పాటు న‌టించిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్రం చూసిన అనంత‌రం బాల‌కృష్ణ మీడియాతో మాట్లాడారు. టేకింగ్ బావుంద‌ని, ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం సూప‌ర్ అన కొనియాడారు. అంతకంటే ఎక్కువ‌గా క‌ళ్యాణ్ రామ్ అద్భుతంగా న‌టించాడ‌ని ప్ర‌శంసించారు బాల‌య్య‌.

Also Read : లైగ‌ర్ కోకా 2.0 సాంగ్ కెవ్వు కేక

Leave A Reply

Your Email Id will not be published!