Eknath Shinde : త్వ‌ర‌లో అయోధ్య‌ను సంద‌ర్శిస్తా – షిండే

చేసిన వాగ్ధానాల‌పై వెన‌క్కి వెళ్లేది లేదు

Eknath Shinde : మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను త్వ‌ర‌లో యూపీలోని అయోధ్య‌ను సంద‌ర్శిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

2019లో ఇచ్చిన వాగ్ధానాల నుంచి బీజేపీ వెన‌క్కి వెళుతుంద‌న్న ప్ర‌చారాన్ని ఖండించారు. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గాన్ని విస్త‌రిస్తామ‌ని తెలిపారు. కేవ‌లం 39 మంది ఉండాల్సిన కేబినెట్ లో కేవ‌లం 18 మందికి మాత్ర‌మే చోటు ద‌క్కింది.

ప్ర‌స్తుతం సీఎం, డిప్యూటీ సీఎంగా మాత్ర‌మే ఉన్నారు. ఆ ఇద్ద‌రి చేతుల్లో ఇప్పుడు ప్ర‌భుత్వం న‌డుస్తోంది. 18 మంది మంత్రులుగా కొలువు తీరినా ఇప్ప‌టి వ‌ర‌కు శాఖ‌లు కేటాయించ‌లేదు.

అంటే శాఖ‌లు లేని మంత్రులుగా ఉన్నారు. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు శివ‌సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. థానే జిల్లాలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde)  పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇందులో భాగంగానే అయోధ్య‌లోని రామాల‌యాన్ని సంద‌ర్శిస్తాన‌ని చెప్పారు. తాను సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన 41 రోజుల త‌ర్వాత క్యాబినెట్ ను విస్తరించామ‌న్నారు.

కొంత ఆల‌స్యం జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. కొన్ని స‌మీక‌క‌ర‌ణ‌లు, లెక్క‌లు, త‌న ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌తో స‌హా ప‌లు కార‌ణాల వ‌ల్ల లేటైంద‌న్నారు ఏక్ నాథ్ షిండే.

త‌న‌ను సీఎంగా చేయ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్లు త‌మ పెద్ద మ‌న‌సు చాటుకున్నారంటూ కితాబు ఇచ్చారు సీఎం. ఫ‌డ్న‌వీస్ స‌మ‌క్షంలో తాను అమిత్ షా, మోదీని క‌లిశాన‌ని చెప్పారు.

అస‌లైన శివ‌సేన పార్టీ త‌మదేన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

Also Read : ఒక ఎమ్మెల్యే ఒక పెన్ష‌న్ చారిత్రాత్మ‌కం

Leave A Reply

Your Email Id will not be published!