Uddhav Thackeray : జెండాలు ఎగరేస్తే దేశ‌భ‌క్తులు కాలేరు

శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే కామెంట్

Uddhav Thackeray : శివ‌సేన పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతోంది. ఈ త‌రుణంలో పంధ్రాగ‌స్టుకు స‌న్న‌ద్దం అవుతోంది.

హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ప్ర‌ధాని ఇచ్చిన పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర వేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా జాతీయ జెండాల‌ను ఎగుర వేయ‌డం మంచిదే కానీ ఇదే స‌మ‌యంలో దేశానికి కాప‌లా కాస్తున్న సైన్యంలో కోత విధించ‌డం సాధ్య‌మేనా అని ప్ర‌శ్నించారు ఉద్ద‌వ్ ఠాక్రే.

జాతీయ వాదం పేరుతో రాజ‌కీయం చేయ‌డం ఒక్క బీజేపీకే చెల్లింద‌న్నారు. అయితే జాతీయ జెండాల‌ను ఎగుర వేసినంత మాత్రాన దేశ భ‌క్తులు కాలేరంటూ నిప్పులు చెరిగారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray).

హ‌ర్ ఘ‌ర్ తిరంగ కార్య‌క్ర‌మం కేవ‌లం ప్ర‌చారంగా మార్చారంటూ ప్ర‌ధాన మంత్రిపై మండిప‌డ్డారు 75 ఏళ్ల త‌ర్వాత మ‌నం ఆలోచించాల్సింది ప్ర‌జాస్వామ్యం నిజంగా ఉందా అని ప్ర‌శ్నించారు.

ఎందుకంటే ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం, మ‌తం పేరుతో విభేదాలు సృష్టిస్తూ , వ్యాపార‌స్తుల‌కు మేలు చేకూర్చడ‌మే ఆజాద్ కీ అమృత్ మ‌హోత్సవా అని నిల‌దీశారు ఉద్ద‌వ్ ఠాక్రే.

ఇదిలా ఉండ‌గా 1960లో త‌న తండ్రి బాల్ ఠాక్రే కార్టూన్ మ్యాగ‌జైన్ 62వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ వ్యాఖ్య‌లు చేశారు మాజీ సీఎం.

స‌రిహ‌ద్దులో ఇంకా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. చైనా దూసుకు వ‌స్తోంది. కాంట్రాక్టు వ్య‌వ‌స్థ‌తో ఆర్మీని నిర్వీర్యం చేస్తే ల‌క్ష్యం సిద్దిస్తుందా అని ప్ర‌శ్నించారు శివ‌సేన చీఫ్‌.

Also Read : త్వ‌ర‌లో అయోధ్య‌ను సంద‌ర్శిస్తా – షిండే

Leave A Reply

Your Email Id will not be published!