Maharashtra Cabinet : ఫడ్నవీస్ కు హోం..ఆర్థిక శాఖ
మంత్రులకు శాఖల కేటాయింపు
Maharashtra Cabinet : ఎట్టకేలకు మరాఠా కేబినెట్ లో కొలువు తీరిన మంత్రులకు(Maharashtra Cabinet) శాఖలు కేటాయించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టాక ఏక్ నాథ్ షిండే సీఎంగా కొలువు తీరారు.
భారతీయ జనతా పార్టీ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కొలువు తీరిన 41 రోజుల తర్వాత 18 మందితో కేబినెట్ విస్తరించారు.
ఇందులో 9 పదవులు షిండే వర్గానికి మరో 9 పదవులు దేవేంద్ర ఫడ్నవీస్ వర్గానికి కేటాయించారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సీరియస్ కామెంట్స్ చేశారు.
పదవులు లేకుండానే మంత్రులు ఎలా పని చేస్తారంటూ ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా నిలదీసింది. దీంతో ముందు జెండాలు ఎగరవేయండి ఆ తర్వాత శాఖలు కేటాయిస్తామంటూ ఫడ్నవీస్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.
అనుకున్నట్టుగానే ఆదివారం మరాఠా కేబినెట్ లో మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది. అంతా ఊహించినట్లుగానే దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం శాఖతో పాటు ఆర్థిక శాఖ దక్కింది.
ఇక సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే పట్టణాభివృద్ది శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం ప్రణాళిక శాఖ కూడా నిర్వహిస్తారని చెప్పారు షిండే. విఖే పాటిల్ రెవిన్యూ శాఖ చేపడతారు.
బీజేపీకి చెందిన ముంగంటివార్ కు అటవీ శాఖ దక్కింది. ఇక బీజేపీ మాజీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ కు ఉన్నత , సాంకేతిక విద్య శాఖ ను కేటాయించారు. శాసనసభా వ్యవహారాలు కూడా చూస్తారు.
పాఠశాల విద్యా శాఖను దీపక్ కేసర్కర్ కు ఇచ్చారు. అబ్దుల్ సత్తార్ కు వ్యవసాయ శాఖ ను అప్పగించారు.
Also Read : జెండాలు ఎగరేస్తే దేశభక్తులు కాలేరు