PM Modi : మహిళలు లేకపోతే దేశం లేదు – మోదీ
దేశాభివృద్దిలో మీ పాత్ర ప్రశంసనీయం
PM Modi : మహిళలు లేక పోతే ఈ దేశం లేదన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్బంగా ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర విస్మరించ లేనిదన్నారు ప్రధాన మంత్రి. యావత్ ప్రపంచం మన సంస్కృతి, సంప్రదాయం, నాగరికతను చూసి నేర్చుకుంటోందన్నారు.
ఈ లోకంలో ఏ దేశంలో లేని విధంగా ఈ పవిత్ర భూమిలో మహిళలకు ఎనలేని గౌరవం ఉందన్నారు. ఇంకెక్కడా లేదన్నారు. మహిళలను తల్లులుగా భావించే గౌరవనీయ సంస్కృతి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).
మన వారసత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. గతాన్ని అర్థం చేసుకోక పోతే భవిష్యత్తు ఉండదన్నారు. యోధులు, యోగులు, రుషులు, మహానుభావులు, మహా రుషులు నడయాడిన సమున్నత భారతమన్నారు.
దేశం ఒకే రకమైన భావన కలిగి ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదానికి తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ప్రధాన మంత్రి చెప్పారు.
జాతి అభ్యున్నతికి పాటుపడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నారు. భారత దేశ ప్రగతికి సమానత్వం మూల స్తంభమని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
సమున్నత భారతం నేటికీ విరాజిల్లుతున్నది కేవలం ప్రజాస్వామ్యం వల్లనేనని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి. భారత దేశ వృద్దికి మహిళల పట్ల గౌరవం ఒక ముఖ్యమైన మూల స్తంభమన్నారు.
Also Read : యువత దేశం కోసం అంకితం కావాలి