Nitish Kumar : 10 లక్షల జాబ్స్ 20 లక్షల మందికి ఉపాధి
సంచలన ప్రకటన చేసిన బీహార్ ముఖ్యమంత్రి
Nitish Kumar : భారతీయ జనతా పార్టీకి చెందిన ఆరోపణలకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు బీహార్ సీఎం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. జాబ్స్ , ఉపాధి ఎలా చూపుతారంటూ ప్రశ్నలకు జవాబు ఇచ్చారు.
పంద్రాగస్టు సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 20 లక్షల మందికి ఉపాధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నితీశ్ కుమార్(Nitish Kumar).
ఇదిలా ఉండగా 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తేజస్వి యాదవ్ 10 లక్షల ఉద్యోగాలు తాము పవర్ లోకి వస్తే భర్తీ చేస్తామన్నారు.
ఈ మేరకు హామీ ఇచ్చారు. కానీ అనుకోని రీతిలో బీజేపీ, జేడీయూ సర్కార్ కూలి పోయింది. ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కలిసి సంయుక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ కొలువు తీరారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే బహిరంగంగా ప్రకటించాడు.
కేవలం 30 రోజుల వ్యవధిలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించాడు. తాజాగా సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. పాట్నా లోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో నితీశ్ కుమార్ ఈ ప్రకటన చేశారు.
మరోసారి తమ కూటమిని గెలిపిస్తే తప్పకుండా మీరు కోరుకున్నట్లుగానే కొలువులతో పాటు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు నితీశ్ కుమార్. బీజేపీ చెపుతుందే కానీ ఆచరణలో చూపదన్నారు.
ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేసిన సీఎం నితీశ్ కుమార్ ను అభినందించారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.
Also Read : పోస్టల్ సర్వీస్ పిన్ కోడ్ కు 50 ఏళ్లు