Tiranga Selfies Record : స‌మున్న‌త భార‌తం త్రివ‌ర్ణ శోభితం

44 మిలియ‌న్ల‌కు పైగా తిరంగ సెల్ఫీలు

Tiranga Selfies Record : దేశం పంధ్రాగ‌స్టును ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌య్యింది. ప్ర‌స్తుతం 76వ వ‌సంతంలోకి అడుగు పెట్టింది.

ఈ సంద‌ర్భంగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల దాకా ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఇళ్ల‌పై జాతీయ ప‌తాకాల‌ను ఎగుర వేశారు.

ప్ర‌త్యేకించి సామాజిక మాధ్య‌మాల‌లో త‌మ ప్రొఫైల్ పిక్చ‌ర్స్ ను త్రివ‌ర్ణ ప‌తాకాల‌తో నింపేశారు. కాల‌ర్ ట్యూన్ ల‌ను కూడా మార్చేశారు. వందేమాత‌రం, ఇత‌ర దేశ భ‌క్తి గీతాల‌ను కాల‌ర్ ట్యూన్ల‌గా ఏర్పాటు చేసుకున్నారు.

ప్ర‌తి ఒక్క‌రిలో జాతీయ భావాన్ని పెంపొందించేలా , జాతీయ జెండాపై గౌర‌వం పెంపొందించేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్ర‌తి రంగానికి చెందిన వారంతా జెండా పండ‌గ‌లో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, ఆయ‌న స‌తీమ‌ణితో పాటు న‌టులు అమీర్ ఖాన్ , అమితాబ్ బ‌చ్చ‌న్, అనుపమ్ ఖేర్ , అక్ష‌య్ కుమార్ , అజ‌య్ దేవ‌గ‌న్ , క్రికెట‌ర్లు స‌చిన్ టెండూల్క‌ర్ , రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం జెండా పండ‌గ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర వేశారు.

ఆపై సెల్ఫీలు తీసుకుంటూ(Tiranga Selfies Record)  చ‌రిత్ర సృష్టించారు. ఇక హ‌ర్ ఘ‌ర్ తిరంగ వెబ్ సైట్ లో 44 మిలియ‌న్ల‌కు పైగా ప్ర‌జ‌లు త‌మ సెల్ఫీల‌ను భార‌త జాతీయ ప‌తాకంతో అప్ లోడ్ చేశారు. ప్ర‌భుత్వం ఫోన్ కాల‌ర్ ట్యూన్ ను కూడా మార్చేసింది.

Also Read : యువ‌త దేశం కోసం అంకితం కావాలి

Leave A Reply

Your Email Id will not be published!