Rahul Gandhi : అవినీతి..బంధుప్రీతిపై రాహుల్ ఎద్దేవా
జాతిని ఉద్దేశించిన ప్రసంగించిన మోదీపై ఫైర్
Rahul Gandhi : దేశ వ్యాప్తంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. దేశ రాజధాని ఎర్ర కోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, బంధుప్రీతి దేశానికి అవరోధంగా మారాయని వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
యావత్ ప్రపంచం ప్రస్తుతం భారత దేశం వైపు చూస్తోందని చెప్పారు. మోదీ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినవని తెలుస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు.
జాతీయ వాదం పేరుతో చివరకు జాతీయ జెండాను కూడా మార్కెట్ మయం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఎవరి పాలనలో అవినీతి రాజ్యం ఏలుతున్నదో , ఎవరి పాలనలో దేశం అధోగతి పాలైందో 140 కోట్ల ప్రజలకు తెలుసన్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రధానికి , భారతీయ జనతా పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. తాను వ్యక్తిగతంగా ఎవరినీ నిందిందల్చు కోలేదన్నారు.
తన అభిమతం అది కాదన్నారు. ఇవాళ దేశంలో ప్రధానమైన సమస్యలు ఎన్నో ఉన్నాయని కానీ వాటి గురించిన ప్రస్తావనే లేదన్నారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు పై పైకి పోతోందని రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడి పోయిందని వాటి గురించి ఎందుకు ప్రస్తావంచ లేదో మోదీ దేశానికి సమాధానం చెప్పాలన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : 1947 నుంచి నేటి దాకా రూపాయి జర్నీ