Mahesh Babu : జెండా పండుగలో మహేష్ బాబు
ఒకే దేశం ఒకే భావోద్వేగం అద్భుతం
Mahesh Babu : దేశ వ్యాప్తంగా స్వాతంత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు పూర్తయ్యాయి. నేటి పంధ్రాగస్టుతో 76వ వసంతంలోకి అడుగు పెట్టింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హర్ ఘర్ తిరంగా పేరుతో దేశంలోని ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే జాతీయ జెండా ఔన్నత్యం గురించి ప్రతి ఒక్కరికి తెలియ చెప్పేందుకు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని కోరడంతో యావత్ భారతం జెండా పండుగలో పాల్గొన్నారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ , శాండిల్ వుడ్ సినిమా పరిశ్రమలకు చెందిన సినీ నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నికల్ సిబ్బంది పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా తమ సెల్ఫీలను జాతీయ జెండాలతో సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో , ప్రిన్స్ మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.
ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన జాతీయ జెండాతో కూడిన ఫోటో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్ ను షేక్ చేస్తోంది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జాతీయ పతాకాలను ఎగుర వేసే పనిలో పడ్డారు. జై మహేష్ బాబు(Mahesh Babu) అంటూ నినాదాలు చేస్తూ మేరా భారత్ మహాన్ అంటూ పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉండగా క్రికెటర్లు సచిన్ టెండూలర్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆయన సతీమణి నటి అనుష్క శర్మ సైతం తమ ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.
Also Read : సమున్నత భారతం త్రివర్ణ శోభితం
One nation.. One emotion.. One identity! Celebrating 75 years of Independence! 🇮🇳#ProudIndian #HarGharTiranga @AmritMahotsav pic.twitter.com/BN5OOtWHj2
— Mahesh Babu (@urstrulyMahesh) August 15, 2022