Atal Bihari Vajpayee : అజాత‌శ‌త్రువుకు అశ్రు నివాళి

నేడు అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ వ‌ర్ధంతి

Atal Bihari Vajpayee : భార‌త దేశ రాజ‌కీయాలలో విల‌క్ష‌ణ‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు అట‌ల్ బిహారీ వాజ్ పేయి. చిన్న త‌నం నుంచి క‌ష్ట‌ప‌డి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్ర‌ధానిగా ప‌ని చేశారు.

త‌న‌దైన ముద్ర వేశారు. శ్వాస ఉన్నంత వ‌ర‌కు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇలాంటి వ్య‌క్తులు చాలా అరుదు.

జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి త‌ర్వాత అంత‌టి పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన అరుదైన రాజ‌కీయ దురంధ‌రుడు వాజ్ పేయ్.

అట‌ల్ జీ భావుకుడు, మాన‌వ‌తావాది, ప్రేమికుడు, నిష్క‌ళంక దేశ‌భ‌క్తుడు, క‌వి, ర‌చ‌యిత‌, వ‌క్త‌, విశ్లేష‌కుడు, ప్ర‌కృతి ఆరాధ‌కుడు..విల‌క్ష‌ణ‌మైన రాజ‌కీయ నేత‌.

.ఇలా చెప్పుకుంటూ ఇలాంటి నాయ‌కుడు భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉండ‌డం అరుదు. అత్యంత నిబ‌ద్ద‌త క‌లిగిన వ్య‌క్తి నుంచి వ్య‌వ‌స్థ‌గా ఎదిగిన మ‌హోన్న‌త మాన‌వుడు అట‌ల్ బిహారీ వాజ్ పేయి(Atal Bihari Vajpayee).

అశేష జ‌నాద‌ర‌ణ ఉన్న ప్ర‌ముఖుడిగా గుర్తింపు పొందారు. ఆగ‌స్టు 16 మంగ‌ళ‌వారం వాజ్ పేయ్ వ‌ర్దంతి. ఈ సంద‌ర్భంగా దేశ్ కీ నేత‌గా పేరొందిన అట‌ల్ బిహారీ వాజ్ పేయ్ స‌మాధి ఉన్న న్యూఢిల్లీ స్మార‌క స్థ‌లం స‌దైవ్ అట‌ల్ వ‌ద్ద ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ , ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా, అమిత్ చంద్ర షా, కిరెన్ రిజిజు, త‌దిత‌ర ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండ‌గా వాజ్ పేయి ద‌త్త‌త కూతురు న‌మీతా కౌల్ భ‌ట్టాచార్య కూడా నివాళులు అర్పించారు.

Also Read : పెండింగ్ కేసుల ప‌రిష్కారంపై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!