Bihar New Cabinet : నితీశ్ కేబినెట్ లో 31 మందికి చోటు
ఎక్కువ మంది లాలూ పార్టీ వారే
Bihar New Cabinet : బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం తన ఇద్దరు సభ్యులతో కూడిన కేబినెట్ ను విస్తరించేందుకు శ్రీకారం చుట్టనున్నారు.
జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ పార్టీలతో కూడిన మహా ఘట్ బంధన్ లేదా మహా కూటమి ప్రభుత్వం ఈనెల ప్రారంభంలో కొలువు తీరింది.
గత 17 ఏళ్లుగా జేడీయూ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు గుడ్ బై చెప్పారు నితీశ్ కుమార్. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ కొలువు తీరారు.
తాజాగా కొత్త కేబినెట్(Bihar New Cabinet) లో 31 మందికి చోటు దక్కనుంది. ఎక్కువ మంది మంత్రులుగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి ప్రయారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. కూటమి భాగస్వామ్య పక్షమైన రాస్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కి అత్యధిక స్థానాలు లభించనున్నాయి.
ఇందుకు సంబంధించి ఆగస్టు 16న ముహూర్తం ఖరారు చేశారు సీఎం నితీశ్ కుమార్. రాజ్ భవన్ లో ఈ వేడుక జరగనుంది.
ప్రస్తుతం కొలువు తీరే కొత్త మంత్రివర్గంలో విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చదరి, సంజయ్ ఝా, మదన్ సాహ్ని, జయంత్ రాజ్ , షీలా
మండల్ , బిజేంద్ర యాదవ్ , శ్రవణ్ కుమార్ , సునీల్ కుమార్ , జమా ఖాన్ కు చోటు దక్కనుంది.
ఇక ఇప్పటికే తమ పార్టీ జనతాదళ్ యునైటెడ్ కు చెందిన మంత్రులందరినీ నితీశ్ కుమార్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఆర్జేడీ నుండి తేజ్ ప్రతాప్ యాదవ్ , సురేంద్ర యాదవ్ , లలిత్ యాదవ్ , కుమార్ సర్వ జీత్ , సురేంద్ర రామ్ , షానవాజ్ ఆలం, సమీర్ మహా సేత్,
భరత్ మండల్, అనితా దేవి, సుధాకర్ సింగ్ ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి అఫాక్ ఆలం, మురారీ లాల్ గౌత్, జితిన్ రామ్ మాంఝీతో పాటు హిందూస్తానీ అవామ్ మోర్చా నుంచి సంతోష్ సుమన్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read : సమున్నత భారతం త్రివర్ణ శోభితం