KS Eshwarappa : హిందూ సమాజం మేల్కొంటే తట్టుకోలేరు
బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప కామెంట్స్
KS Eshwarappa : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందూ సమాజం మేల్కొంటే తట్టుకోలేరని హెచ్చరించారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే యువకులపై ముస్లిం సమాజంలోని పెద్దలు, సీనియర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
కేఎస్ ఈశ్వరప్ప శివమొగ్గ కేసుపై మంగళవారం స్పందించారు. తాజాగా కర్ణాటకలోని శివ మొగ్గలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పంధ్రాగస్టు సందర్భంగా హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ బ్యానర్ ను బీజేపీ తో పాటు దాని అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశాయి.
దీనికి వ్యతిరేకంగా 18వ శతాబ్ధానికి చెందిన మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బ్యానర్లను ఏర్పాటు చేశాయి ముస్లిం సంఘాలు. ఈ బ్యానర్ల ఏర్పాటుపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.
20 ఏళ్ల ప్రేమ్ సింగ్ కత్తితో పొడవడం కలకలం రేపింది. దీనిపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప నిప్పులు చెరిగారు.
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న తమ సామాజిక వర్గానికి చెందిన యువకులపై చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలను కోరుతున్నాననని అన్నారు .
హిందూ సమాజం మేల్కొంటే తట్టుకోవడం కష్టమన్నారు మాజీ మంత్రి ఈశ్వరప్ప(KS Eshwarappa). షాపు మూయించేందుకు వెళుతున్న ఓ వ్యక్తిని కత్తితో పొడిచారంటూ ఆరోపించారు ఈశ్వరప్ప.
ప్రస్తుతం శివ మొగ్గలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలను శాంతింప చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కర్ణాటకలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా కర్ణాటకలో ఎస్డీపీఐ, పీఎఫ్ఐలను నిషేధించాలని ఈశ్వరప్ప డిమాండ్ చేశారు.
Also Read : నియామకాల్లో న్యాయ శాఖ రికార్డ్
#WATCH | I request senior members of Muslim community to take action against youth of their community involved in such anti-national activities. If Hindu society rises, then such activities won't survive: BJP MLA from Shivamogga,KS Eashwarappa on stabbing incident#Karnataka pic.twitter.com/hUSuQx2xld
— ANI (@ANI) August 16, 2022