China Spy Ship : చైనా నిఘా నౌక పై భారత్ ఆందోళన
దాని వెనుక గల కారణాలు ఏంటి
China Spy Ship : భారత ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది చైనా నిఘా నౌక(China Spy Ship) ఎంట్రీపై. దాని వెనుక గల కారణాలు చూస్తే చాలా ఉన్నాయి. ప్రధానంగా గత కొంత కాలంగా భారత, చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
డ్రాగన్ చైనా ప్రతి దానికి కయ్యానికి కాలు దువ్వుతోంది. శ్రీలంకను అడ్డం పెట్టుకుని చైనా భారత్ ను టార్గెట్ చేస్తోంది. పేరుకు నౌక అయినప్పటికీ గూఢచర్యం చేసేందుకే ఇక్కడ మోహరిస్తోందంటూ ఆందోళన చెందుతోంది భారత్.
శ్రీలంకలోని హంబన్ తోట నౌకాశ్రయం వద్దకు చైనా నౌక మంగళవారం ఉదయం చేరుకుంది. ఇది చైనాకు లీజుకు ఇచ్చింది శ్రీలంక. ఈ వివాదస్పాద నిఘా చైనా నౌక పేర యువాన్ వాంగ్ 5. గూఢచారి నౌక 8.30 గంటలకు హంబన్ టోట ఓడ రేవుకు చేరుకుంది.
చైనా నౌక రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది భారత్. ఇదే విషయాన్ని శ్రీలంక సర్కార్ కు స్పష్టం చేసింది. భారత్ ఆందోళన చెందడానిక ప్రధాన కారణం.
భారత్ కు చెందిన బాలిస్టిక్ క్షిపణులను పరీక్షిస్తే వాటిని ట్రాక్ చేయగల సెన్సార్లు యుయాంగ్ వాంగ్ 5 నౌకలో ఉన్నాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలో భారత్ తన క్షిపణులను పరీక్షంచింది.
ఇదిలా ఉండగా ఓడకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉంది చైనా నౌక. భారత క్షిపణుల పరిధి, ఖచ్చితత్వాన్ని పరీక్షిస్తే అంచనా వేయగల స్థితిలో ఉంటుంది.
హిందూ మహాసముద్రంలో జలాంతర్గామి కార్యకలాపాలను సులభతరం చేసే సముద్ర సర్వేలను కూడా ఇది చేపడతుందని అనుమానం.
Also Read : శ్రీలంక ఓడ రేవుకు చేరుకున్న చైనా నిఘా నౌక