Aam Aadmi Clinics : ఆమ్ ఆద్మీ క్లినిక్ ల‌కు సీఎం శ్రీ‌కారం

మెరుగైన ఆరోగ్య సేవ‌ల‌కు శ్రీ‌కారం

Aam Aadmi Clinics : పంజాబ్ లో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఎన్నిక‌ల హామీల‌లో భాగంగా ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు సీఎం భ‌గ‌వంత్ మాన్.

ప్ర‌తి ఒక్క‌రికి వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ క్లినిక్(Aam Aadmi Clinics) లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు పంధ్రాగ‌స్టును పుర‌స్క‌రించుకుని వాటిని ప్రారంభించారు సీఎం.

పంజాబ్ రాష్ట్రంలో 100 ఆమ్ ఆద్మీ క్లినిక్ లు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించ‌డంలో నిమగ్నమై ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. మొద‌టి ద‌శ‌లో 75 క్లినిక్ లు పూర్తి స్థాయిలో ప‌ని చేయ‌డం ప్రారంభించాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ని చేయ‌కుండా ఉన్న సువిధ కేంద్రాల‌ను మాత్ర‌మే ఆమ్ ఆద్మీ క్లినిక్ లుగా మార్చిన‌ట్లు తెలిపింది ప్ర‌భుత్వం. ఢిల్లీలో మొహ‌ల్లా క్లినిక్ ల మాదిరే ఇక్క‌డ కూడా ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి.

అయితే వారి ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు భ‌గ‌వంత్ మాన్. మంచిది ఎక్క‌డున్నా స్వీక‌రించడం త‌మ సిద్దాంత‌మ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే దైనినైనా, ఏ కార్య‌క్ర‌మ‌మైనా, ఏ సంక్షేమ ప‌థ‌క‌మైనా స్వీక‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు భ‌గ‌వంత్ మాన్.

గ్రామీణ ప్రాంతాల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ అందించేందుకు వీటిని ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టికే సువిధ పేరుతో క్లినిక్ లు న‌డుస్తున్నాయ‌ని , కానీ ఆప్ స‌ర్కార్ ఆ నేమ్ ప్లేట్ ల‌ను మాత్ర‌మే మార్చి రాజ‌కీయం చేస్తోందంటూ శిరోమ‌ణి అకాళీద‌ళ్ కు చెందిన మాజ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ బాద‌ల్ ఆరోపించారు.

Also Read : హిందూ స‌మాజం మేల్కొంటే త‌ట్టుకోలేరు

Leave A Reply

Your Email Id will not be published!