Bihar New Cabinet : బీహార్ లో కొలువు తీరిన కొత్త కేబినెట్
31 మందికి చోటు కల్పించిన సీఎం నితీశ్
Bihar New Cabinet : జేడీయూ, ఆర్జేడీ మహా కూటమి ప్రభుత్వంలో పలువురు కొత్త మంత్రులు కొలువు తీరారు. ఈ ఆగస్టు నెలలో జేడీయూ, బీజేపీ 17 ఏళ్ల బంధానికి చెక్ పెట్టింది.
కొత్తగా లూలా పార్టీ, కాంగ్రెస్ తో జత కట్టారు సీఎం నితీశ్ కుమార్. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీకి చెందిన లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
మంగళవారం 31 మందితో మంత్రివర్గాన్ని(Bihar New Cabinet) ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కువ మంది తేజస్వి పార్టీకి చెందిన వారే ఉండడం
గమనార్హం. కొత్త మంత్రులతో గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
కొలువు తీరిన కొత్త కేబినెట్ లో ఆర్జేడీ కి 16 మంతి పదవులు దక్కాయి. ఇక జనతా దళ్ యునైటెడ్ నితీశ్ కు చెందిన పార్టీకి 11 మంత్రి పదవులు లభించాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్థానీ అవామ్ మార్చా నుండి ఒకరు , ఇండిపెండెంట్ ఎమ్మెల్యే
సుమిత్ కుమార్ సింగ్ కూడా చోటు దక్కింది.
వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్ భవన్ లో. ఇక మంత్రులుగా కొలువు తీరిన వారిలో మహ్మద్ జమా ఖాన్ , జయంత్ రాజ్ , షీలా
కుమారి, సునీల్ కుమార్ , సంజయ్ ఝా , మదన్ సాహ్ని, శ్రవణ్ కుమార్ , అశోక్ చౌదరి, లేషి సింగ్ , విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్ ఉన్నారు.
ఇక ఆర్జేడీ నుండి తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ , అలోక్ మెహతా, సురేంద్ర ప్రసాద్ యాదవ్ , రామానంద్ యాదవ్ , కుమార్ సర్వ జీత్
, లలిత్ యాదవ్ , సమీర్ కుమార్ మహా సేత్ , చంద్రశేఖర్ , జితేంద్ర కుమార్ రాయ్ , అనితా దేవి, సుధాకర్ సింగ్ , ఇజ్రాయెల్ మన్సూరి,
సురేంద్ర సింగ్ , కార్తికేయ, షానవాజ్ ఆలం, షమీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు.
వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అఫాక్ అలం , మురారి లాల్ గౌత్ మ్ కూడా కేబినెట్ లో చేరారు.
Also Read : ఆమ్ ఆద్మీ క్లినిక్ లకు సీఎం శ్రీకారం