Arvind Kejriwal : విద్య‌..వైద్యం ఉచితం కాదు బాధ్య‌త

ప్ర‌క‌టించిన సీఎం అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయ‌న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాణ్య‌మైన విద్య‌, వైద్యం అందించ‌డం ఉచితం కాద‌న్నారు. దేశంలోని పౌరులంద‌రికీ ఆరోగ్యం, విద్య‌ను ఉచితంగా అందించేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.

బ‌ర్త్ డే సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న పౌరుల‌కు రుణ‌ప‌డి ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న ప్రాథ‌మిక సేవ‌లు ఉచితాలు అని పిల‌వ‌కూడ‌ద‌ని సూచించారు.

ఇటీవ‌ల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ధీటుగా స‌మాధానం ఇచ్చారు. ఈ దేశంలో ఇంకా దారిద్ర రేఖ‌కు దిగువ‌న ఉన్నార‌ని వారంద‌రికీ మెరుగైన వైద్యం, విద్య‌ను అందించ‌డం పాల‌కుల మొద‌టి కర్తవ్యం కావాల‌న్నారు.

అవి ఉచితం కావ‌ని బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్ర‌భుత్వం త‌న ప్ర‌జ‌ల‌కు ఉచిత ఆరోగ్య సేవ‌ల‌ను అందించేందుకు గాను ప్ర‌తి వ్య‌క‌తికి సంవ‌త్స‌రానికి స‌గ‌ట‌ను రూ. 2,000 ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు.

దీనిని రూ. 2.5 ల‌క్ష‌ల కోట్ల‌తో దేశ వ్యాప్తంగా 1.3 బిలియ‌న్ల ప్ర‌జ‌ల‌కు అందించ వ‌చ్చ‌ని ఆప్ చీఫ్ అన్నారు. అలా చేయాల‌ని అనుకుంటే ఆస్ప‌త్రులు, మొహ‌ల్లా క్లినిక్ లు, డిస్పెన్స‌రీలు పెద్ద ఎత్తున ప్రారంభించాల‌ని సూచించారు కేంద్రానికి.

కొన్ని రాష్ట్రాల‌లో ఉద్దేశ పూర్వ‌కంగానే విద్య‌ను ప్రైవేట్ ప‌రం చేస్తున్నార‌ని ఆరోపించారు. కేంద్ర స‌ర్కార్ వ్యాపారులు, కార్పొరేట్లు, బ‌డా బాబుల‌కు వ‌త్తాసు ప‌లుకుతోంద‌న్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).

Also Read : సామాన్యుడి స్వ‌రం కేజ్రీవాల్ సంత‌కం

Leave A Reply

Your Email Id will not be published!