Bilkis Bano : బిల్కిస్ బానో దోషులను వెనక్కి తీసుకోవాలి
6,000 వేల మందికి పైగా సంతకాల సేకరణ
Bilkis Bano : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ బిల్కిస్ బానో (Bilkis Bano) సామూహిక అత్యాచారం, హత్య కేసు ఘటనలో దోషులైన 11 మందిని విడుదల చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
దేశ వ్యాప్తంగా 6,000 వేల మందికి పైగా సంతకాలు చేస్తూ దోషులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తనకు అన్యాయం
జరిగిందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిల్కిస్ బానో(Bilkis Bano).
సీబీఐ దర్యాప్తు చేసింది. చివరకు 2008 జనవరి 21న ముంబై లోని ప్రత్యేక సీబీఐ కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో
సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్ బానో 21 ఏళ్ల వయస్సు. 5 నెలల గర్భిణీ.
దోషులకు విధించిన శిక్షలను ఉపసంహరించు కోవాలని అట్టడుగు కార్మికులు, మహిళలు, మానవ హక్కుల కార్యకర్తలో సహా 6,000 మంది పౌరులు సుప్రీంకోర్టును కోరారు.
సామూహిక అత్యాచారం, సామూహిక హత్యలకు పాల్పడిన 11 మంది దోషుల శిక్షల ఉపశమనం ప్రమాదకరమైనది. ప్రతి అత్యాచార బాధితుడి పట్ల ఈ
చర్య అత్యంత ప్రభావాన్ని చూపిస్తుందని వారు పేర్కొన్నారు.
ఇకనైనా న్యాయ స్థానం మేలు కోవాలని, వారికి శిక్ష పడేలా చూడాలని కోరారు. సంతకాలు చేసిన వారిలో సయ్యదా హమీద్ , జఫరుల్ ఇస్లాం ఖాన్ , రూప్ రేఖ, దేవకీ జైన్ , ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవితా కృష్ణన్ ,, మైమూనా మొల్లా, హసీనా ఖాన్ , రచన ముద్ర బోయిన, షబ్నం హస్మీ తదితరులు ఈ ప్రకటన చేశారు.
సహేలి ఉమన్స్ రిసోర్స్ సెంటర్ , గమన మహిళా సమూహ, బేబాక్ కలెక్టివ్ , ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ , ఉత్తరాఖండ్ మహిళా
మంచ్ , ఫోరమ్ అగైనెస్ట్ అప్రెషన్ ఆఫ్ ఉమెన్ , ప్రగతి శీలా మహిళా మంచ్ , పర్చమ్ కలెక్టివ్ , జాగృతి ఆదివాసీ దలిత్ సంఘటన్ , అమూమత సొసైటీ, తదితర సంస్థలు ఉన్నాయి.
Also Read : రేపిస్టుల విడుదల సిగ్గు చేటు – మహూవా