Railway Bridge Collapse : కాంగ్రాలో కూలిన రైల్వే వంతెన

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు

Railway Bridge Collapse : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున వ‌ర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. వ‌ర్షం తాకిడికి రైల్వే వంతెన (బ్రిడ్జి) కుప్ప కూలింది. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు ఇంకా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం కూలి పోయిన రైల్వే బ్రిడ్జికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

శ‌నివారం తెల్ల‌వారుజామున ధ‌ర్మ‌శాల‌లో భారీ వ‌ర‌ద‌లు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ్డాయి. దీంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కాంగ్రా, కులు, మండి ప్రాంతాల‌లో పాఠ‌శాల‌లు మూసి వేశారు.

ధ‌ర్మశాల ప్రాంత‌మంతా వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఇదిలా ఉండగా ఉన్న‌ట్టుండి కాంగ్రా లోని చ‌క్కి భారీ వంతెన కూలి పోవ‌డంతో ఆ ప్రాంతంలోని చుట్టు ప‌క్క‌ల జ‌నం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

మ‌రికొంద‌రు భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. రైల్వే బ్రిడ్జి కుప్ప కూల‌డంతో(Railway Bridge Collapse) ఈ మార్గం ద్వారా నిత్యం వెళ్లే రైళ్ల‌ను నిలిపి వేశారు. ఎక్క‌డిక‌క్క‌డ రైళ్లు నిలిచి పోయాయి.

ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఆమేర‌కు దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. సీఎం స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు.

ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్పష్టం చేశారు సీఎం. మ‌రో వైపు చంబా జిల్లాల్లో భారీ వ‌ర్షాల దెబ్బ‌కు కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.

Also Read : యూపీలోని ల‌క్నోలో భూకంపం

Leave A Reply

Your Email Id will not be published!